IRCTC Special Packages: ఒకే ట్రిప్‌లో గుజరాత్ పుణ్యక్షేత్రాలు.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:29 PM
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్‌లో గుజరాత్‌లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: తక్కువ ఖర్చుతో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలు కల్పించింది ఇండియన్ రైల్వే (IRCTC). ఒక ట్రిప్‌లోనే దర్శనీయ ప్రదేశాలను చుట్టేలా సూపర్ ప్యాకేజీని ప్రయాణికులను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు భవ్య గుజరాత్ పేరుతో యాత్రను ఇండియన్ రైల్వే ప్రారంభించనుంది. అక్టోబర్ 26 నుంచే ఈ యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం పది రోజుల పాటు గుజరాత్‌లోని ప్రముఖ క్షేత్రాలను ఈ టూర్ ప్యాకేజ్‌లో దర్శించుకునే అవకాశం ఉంది.
యాత్రా స్థలాలు ఇవే
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్‌లో గుజరాత్‌లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. వాటిలో ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకా ఆలయం, సోమ్‌నాథ్‌లోని సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం, మోడేరా సూర్యదేవాలయం, రాణీ కీ వావ్, ఎక్తానగర్‌లోని స్టాచూ ఆఫ్ యూనిటీని సందర్శించే వీలు కల్పించింది భారత రైల్వే. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభం కానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 26 మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట నుంచి ఈ రైలు బయలుదేరనుంది. అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్ స్టేషన్లలో హోల్డింగ్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఈ యాత్రకు సంబంధించిన వివరాల కొరకు 9701360701, 9221030711 నెంబర్లను సంప్రదించాల్సిందిగా రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్యాకేజీ ధరలు
ఎకానమీ స్లీపర్ క్లాస్ ఒక్కరికి ధర రూ.18,400
స్టాండర్డ్ థర్డ్ ఏసీ రూ.30,200
కంఫోర్ట్ సెకండ్ ఏసీ రూ.39,900
టీ, టిఫిన్, భోజనం, రవాణా, హోటల్ గదులు అన్నీ కలుపుకునే ఈ మేరకు ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి...
బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజ్
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..