Share News

IRCTC Shirdi Tour Package: బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజ్

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:18 PM

షిర్డీ సాయిబాబా భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

IRCTC Shirdi Tour Package: బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజ్
IRCTC Shirdi Tour Package

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీకి ప్రతిరోజూ వేలాది మంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. బస్సులు, రైళ్లు లేదా వ్యక్తిగత వాహనాల్లో ఈ యాత్ర చేస్తుంటారు. అయితే, సాధారణ మధ్యతరగతి ప్రయాణికుల కోసం IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే ప్రత్యేక షిర్డీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ నెలలో టూర్ ప్రారంభం కానుంది. 2 రాత్రులు, 3 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది.

kachiguda.jpg


యాత్ర వివరాలు:

  • IRCTC వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

  • ఈ నెల అక్టోబర్ 29 తేదిన ఈ టూర్ ప్రారంభమవుతుంది.

  • కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ప్రయాణం మొదలవుతుంది.

  • రైలు నెంబర్ 17064

  • ఈ టూర్ ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.

  • ప్రయాణంలో కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ఎక్కే అవకాశం ఉంటుంది.

  • రాత్రంతా ప్రయాణం తర్వాత మహారాష్ట్రలోని నాగర్ సొల్ చేరుకొని, తరువాత షిర్డీకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

  • హోటల్‌లో చెక్-ఇన్ తరువాత షిర్డీ ఆలయ దర్శనం.

  • సాయంత్రం 5 గంటలకు తిరిగి హోటల్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటల లోపు నాగర్ సొల్ చేరాల్సి ఉంటుంది.

  • అలా మళ్లీ రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత కాచిగూడకు ఉదయం 9:45కి చేరుతుంది.

    Temple.jpg


టికెట్ ధరలు:

  • సింగిల్ షేరింగ్ రూ. 7,890

  • డబుల్ షేరింగ్ రూ. 6,660

  • ట్రిపుల్ షేరింగ్ రూ. 6,640


కంఫర్ట్ క్లాస్:

  • ట్రిపుల్ షేరింగ్ రూ. 4,960

  • డబుల్ షేరింగ్ రూ. 4,980

  • సింగిల్ షేరింగ్ రూ. 6,220

ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలను IRCTC ఆఫీషల్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి...

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 12:41 PM