Share News

IRCTC Coorg Tour Package 2025: IRCTC కూర్గ్ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికుల కోసం స్పెషల్ ఆఫర్

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:38 PM

ప్రకృతి ప్రేమికుల కోసం IRCTC కూర్గ్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్యాకేజీని అందిస్తోంది.

IRCTC Coorg Tour Package 2025: IRCTC కూర్గ్ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికుల కోసం స్పెషల్ ఆఫర్
IRCTC Coorg Tour

ఇంటర్నెట్ డెస్క్‌: కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతాన్ని భారతదేశ స్కాట్లాండ్ అని పిలుస్తారు. ఈ కూర్ట్ ప్రాంతం పచ్చని కొండలు, పొగమంచుతో కప్పబడిన లోయలు, జలపాతాలు వంటి ప్రకృతి అందాలతో చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది జనసమూహం నుంచి కొంత దూరంగా, శాంతియుత వాతావరణంతో నిండిన ప్రదేశం కావడంతో ప్రశాంతతను కోరుకునే ప్రయాణికులకు ఇది చాలా బాగుంటుంది.


IRCTC టూర్ ప్యాకేజీ

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించేందుకు ఒక సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో ప్రయాణం, బస, భోజనం అన్నీ కలిపి ఉంటాయి. హోటల్ బుకింగ్ లేదా తినే ఆహారం గురించి ప్రత్యేకంగా ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు.

కొడగు అని కూడా పిలువబడే కూర్గ్, కర్ణాటక దక్షిణ భాగంలో ఉంది. ఇక్కడి పచ్చని ప్రకృతి, జలపాతాలు, పొగమంచు కమ్ముకున్న కొండలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలున్నాయి. ఇక్కడి ప్రజలను కొడవ లేదా కూర్గ్ ప్రజలు అంటారు.

Coorg.jpg


ప్యాకేజీ వివరాలు

  • వ్యవధి: 2 రాత్రులు, 3 పగళ్లు

  • ధర: రూ. 9,520

  • సదుపాయాలు: బస, భోజనం, ప్రయాణం

కుటుంబం లేదా స్నేహితులతో కలిసి తక్కువ ఖర్చుతో అందమైన ప్రదేశాన్ని చూసే అవకాశం ఉంటుంది. పర్యటన మొత్తం 3 రోజుల్లో పూర్తి కావచ్చు. కూర్గ్ ఏ సీజన్‌లోనైనా చూడడానికి బాగుంటుంది. అయితే, ఈ వర్షాకాలంలో పచ్చదనంతో ఇంకా మిక్కిలి అందంగా కనిపిస్తుంది.


బుకింగ్ ఎలా చేయాలి?

మీరు ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకుంటే, IRCTC అధికారిక వెబ్‌సైట్ irctctourism.com కు వెళ్లండి. అక్కడ ఈ ప్యాకేజీ గురించి పూర్తిగా తెలుసుకుని, సులభంగా ఆన్లైన్‌లోనే సీటు బుక్ చేసుకోవచ్చు. అందమైన ప్రకృతి, సరసమైన ధర, పూర్తి సదుపాయాలు... అంతేకాకుండా జనసమూహానికి దూరంగా ప్రశాంతంగా విహరించాలనుకుంటే కూర్గ్ ఉత్తమ ఎంపిక. మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? వెంటనే ప్లాన్ చేసుకోండి. ఈ అవకాశం మళ్లీ రావడం కష్టం!


Also Read:

ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్ కారు కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Ginger Side Effects: అల్లం క్రమం తప్పకుండా ఉపయోగిస్తే హాని కలుగుతుందా?

For More Latest News

Updated Date - Aug 29 , 2025 | 02:42 PM