Share News

IRCTC New Year 2026 Offer: లక్నో టూ గోవా.. IRCTC న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:36 PM

2026 న్యూ ఇయర్‌ సందర్భంగా IRCTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. లక్నో నుండి గోవాకు ప్రత్యేక విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉత్తర గోవా, దక్షిణ గోవా ప్రఖ్యాత దృశ్యాలు, బీచ్‌లు, కోటలు, పడవ ప్రయాణాలు ఉన్నాయి.

IRCTC New Year 2026 Offer: లక్నో టూ గోవా..  IRCTC న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్
IRCTC New Year 2026 Offer

ఇంటర్నెట్ డెస్క్: 2026 కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్‌ సందర్భంగా IRCTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. లక్నో నుండి గోవాకు ప్రత్యేక విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉత్తర గోవా, దక్షిణ గోవా ప్రఖ్యాత దృశ్యాలు, బీచ్‌లు, కోటలు, పడవ ప్రయాణాలు ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా IRCTC అందిస్తున్న ఆ ఆఫర్ ఏంటో, ప్యాకేజీ వివరాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..


IRCTC జనవరి 2026 చివరి వారంలో లక్నో నుండి గోవాకు ప్రత్యేక విమాన ప్రయాణ ప్యాకేజీని ప్రారంభిస్తోంది. దీనిని గోవా డిలైట్ ప్యాకేజీ అని పిలుస్తారు. జనవరి 24 నుండి జనవరి 27 వరకు ఈ ట్రిప్ ఉంటుంది.


IRCTC గోవా డిలైట్ ప్యాకేజీ - ముఖ్య వివరాలు

  • ఫ్లైట్ ఛార్జీలు: లక్నో టూ గోవా, అలాగే రిటర్న్ ఫ్లైట్ ఛార్జీలు

  • ఒక వ్యక్తికి రూ. 53,700

  • డబుల్ ఆక్యుపెన్సీ: వ్యక్తికి రూ. 40,500

  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ: ఒక్కొక్కరికి రూ. 38,000

  • పిల్లల కోసం అదనపు బెడ్: రూ 31,800

  • అదనపు బెడ్ లేని వారి కోసం: రూ 30,100

  • వసతి: ఫోర్ స్టార్ హోటల్‌

  • ప్రయాణం: ఉత్తర గోవా, దక్షిణ గోవాలో ముఖ్యమైన స్థలాలు సందర్శించవచ్చు

  • ప్రత్యేక ఆకర్షణలు: మాండోవి నదిలో బీచ్‌లు, చర్చిలు, కోటలు, పడవ ప్రయాణాలు

  • రుచికరమైన ఆహారం, సౌకర్యవంతమైన ట్రాన్స్‌పోర్ట్

  • బుక్ చేసుకునే విధానం: IRCTC కార్యాలయం లేదా irctctourism.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.


నూతన సంవత్సరం కొత్త ఆశలతో ప్రారంభం కావడానికి ఒక మంచి అవకాశం.. కొంతమంది న్యూ ఇయర్ రెసొల్యూషన్స్ చేసుకుంటారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, విద్య లేదా వ్యక్తిగత అభివృద్ధిపై తీర్మానాలు చేస్తారు. అలాగే, మరికొందరూ నూతన సంవత్సరం సందర్భంగా తమ కుటుంబంతో లేదా ప్రియమైనవారితో ఏదైన ట్రిప్ ప్లాన్ చేయాలని ఇష్టపడతారు. మీరు కూడా ఒక అందమైన ప్రయాణం ప్లాన్ చేస్తుంటే, IRCTC అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ మీకు బెస్ట్ ఆప్షన్‌. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే టికెట్స్‌ బుక్ చేసుకోండి.


Also Read:

న్యూఇయర్.. హద్దు దాటితే కఠిన చర్యలు

శాంతికి విఘాతం కలిగించే చర్యలొద్దు.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోదీ

For More Latest News

Updated Date - Dec 30 , 2025 | 04:51 PM