Insomnia and Dementia Risk: నిద్రలేమి వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 40% పెరుగుతుందా?
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:19 PM
నిద్రలేమి వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 40% పెరుగుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: తాజా పరిశోధన ప్రకారం, దీర్ఘకాలిక నిద్రలేమి వృద్ధుల్లో మతిమరుపు (డిమెన్షియా) వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. సుదీర్ఘ కాలం నిద్ర సమస్యలతో బాధపడుతున్నవారికి, ఇతరులతో పోలిస్తే మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి బలహీనత వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవల ఒక అధ్యయనంలో దాదాపు 6 సంవత్సరాలపాటు 2,750 మంది వృద్ధులను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. నిద్రలేమి ఉన్నవారు.. మెదడులో నిర్మాణాత్మక మార్పులు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
నిద్రలేమి అంటే ఏమిటి?
నిద్రలేమి (Insomnia) అంటే రాత్రిపూట నిద్రపోవడానికి కష్టపడటం, నిద్రలేకుండా ఉండటం లేదా మేల్కొన్న తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్లలేకపోవడం వంటి లక్షణాలతో కూడిన ఒక నిద్ర రుగ్మత. దీనివల్ల పగటిపూట అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. నిద్రలో అంతరాయం కలగడం దీర్ఘకాలిక నిద్రలేమి (chronic insomnia)గా పరిగణిస్తారు. నిద్రలేమి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, నిరాశ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెదడుపై ప్రభావం
నిద్రలేమి ఉన్నవారికి మెదడుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత లోపించడం, గుర్తుపెట్టుకునే శక్తి తగ్గడం, సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది, మూడ్ మార్పులు, ఆందోళన, డిప్రెషన్ వంటి అనేక మెదడు సంబంధిత ప్రభావాలు కలుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది.
నిద్రలేమి ఒక చిన్న సమస్య కాదని, ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీసే తీవ్రమైన ఆరోగ్య సమస్య అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సమయానికి చికిత్స తీసుకోవడం, సరైన నిద్ర అలవాట్లను ఏర్పరచుకోవడం వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, రాత్రి నిద్రకు ముందు మొబైల్, టీవీ, కాఫీ, టీ వంటివి తగ్గించుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
కుక్క ఎంత స్మార్ట్‌గా ఆలోచించిందో.. నీటిలో పడబోతున్న పిల్లాడిని ఎలా కాపాడిందో చూడండి..
సినిమా చూస్తూ మైక్రోవేవ్‌లో వండిన పాప్‌కార్న్ తింటున్నారా? బీ కేర్ ఫుల్
For More Latest News