How To Remove Fevikwik From Hands: ఫెవిక్విక్.. చేతులకు అంటుకుపోయిందా?.. ఇవిగో సింపుల్ చిట్కాలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 06:44 PM
ఒక్కొక్కసారి మన చేతులకు ఫెవిక్విక్ కానీ ఫెవికాల్ కానీ అంటుకుంటుంది. ఫెవికాల్‌ను సులభంగానే తొలగించవచ్చు. కానీ ఫెవిక్విక్‌ను అంత తొందరగా చేతికి అంటుకుంటే వదిలించలేం. అలాంటి సమయంలో ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు విరిగిపోతే.. వాటికి ఫెవిక్విక్‌తో అతికిస్తుంటాం. అలాగే చెక్క వస్తువులు విరిగిపోతే.. ఫెవికాల్‌తో వాటిని అతికిస్తాం. అలాంటి వేళ.. ఒక్కొక్కసారి ఫెవిక్విక్, కానీ ఫెవికాల్ కానీ మన చేతులకు అంటుకు పోతుంది. దీంతో వాటిని తొలగించాలంటే చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. అలా ఇబ్బంది పడే సమయంలో.. ఉప్పు, వెనిగర్ ఆలివ్ ఆయిల్, పెట్రోలియం జెల్లీ, గోళ్ల రంగు రిమూర్, నిమ్మరసం లేదా గోరు వెచ్చని నీటి ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
చేతికి ఫెవిక్విక్, ఫెవికాల్ అతుక్కున్న సమయంలో.. నీటితో కడిగిన తర్వాత అది అంత తేలికగా రాదు. అలాంటి సమయంలో ఇంట్లో అందుబాటులో ఉన్న ఈ సింపుల్ చిట్కాల ద్వారా మీరు ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఉప్పు (Salt) ఒక గొప్ప సహజ క్లీనర్. మీ చేతి వేళ్లకు జిగురు అంటుకున్న ప్రదేశంలో కొద్దిగా ఉప్పుతో రుద్దితే.. జిగురు క్రమంగా వదులుతుంది. ఇంకా ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే మాత్రం.. ఉప్పుతోపాటు కొద్దిగా వెనిగర్‌ను వినియోగించి అతుక్కున్న ప్రదేశంలో రుద్దితే వెంటనే అక్కడి జిగురు వదిలిపోతుంది.
ఆలివ్ ఆయిల్ లేదా పెట్రోలియం జెల్లీ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇవి చేతికి అంటిన జిగురును మృదువుగా చేయడానికి.. చర్మానికి ఏ మాత్రం హాని కలిగించకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఫెవిక్విక్, ఫెవికాల్ చేతికి అతుకున్న ప్రాంతంలో నూనెను రుద్దాలి. కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆపై ఆ భాగాన్ని వదులుగా చేయడానికి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
అలా కాకుంటే.. నెయిల్ పాలిష్ రిమూవర్‌తో ఫెవిక్విక్ అంటుకున్న భాగాన్ని తొలగించవచ్చు. రిమూవర్‌ను కాటన్ బాల్‌పై ఉంచి.. ఎక్కడ అయితే ఫెవిక్విక్ అంటుకుందో ఆ ప్రదేశంలో రుద్దితే జిగురు క్రమంగా కరిగిపోతుంది. మరీ ముఖ్యంగా అసిటోన్ ఉన్న రిమూవర్ అయితే ఫలితం వెంటనే వస్తుంది.
నిమ్మరసంతో సైతం దీనిని తొలగించవచ్చు. నిమ్మకాయలోని ఆమ్లత్వం.. జిగురును కరిగిస్తుంది. జిగురు మీ వేళ్లకు అంటుకున్న వెంటనే.. దానిపై నిమ్మరసం రాసి సున్నితంగా రుద్దాలి. దీంతో చేతికి అంటుకున్న ఫెవిక్విక్ పొర వదులుతుంది. అయితే ఇది మీ చర్మానికి హాని కలిగించదు.
ఇక ఫెవిక్విక్ మీ వేళ్లను అంటుకుంటే.. గోరువెచ్చని నీటిలో వేళ్లని నాన బెట్టడం ఉత్తమం. ఆ నీటిలో కొద్దిగా సబ్బు లేకుంటే డిటర్జంట్ వేసి.. 5 నుంచి 10 నిమిషాలపాటు నానబెట్టాలి. జిగురు మృదువుగా.. సులభంగా వదిలిపోతుంది.
అదీకాక.. జిగురు బలంగా ఉంటే.. దానిని బలవంతంగా తీయవద్దు. అలా చేయడం వల్ల చర్మం సున్నితత్వం దెబ్బతింటుంది. అందువల్ల పైన చెప్పిన అంశాల్లో ఏదో ఒక దానిని అమలు చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
(ఈ వ్యాసంలోని అంశాలు.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి దీనితో ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీనికి ఏ విధంగానూ బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి..
తలలో పేలు పోవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు..
తులసి ఆకులు తినడం.. ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
For More Life Style News And Telugu News