Health Tips: తులసి ఆకులు తినడం.. ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:51 AM
తులసి ఆకుల్లో విటమిన్ సి, జింక్, ఐరన్, కాల్షియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతాయని పేర్కొంటారు. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తులసి ఒక రకంగా చెప్పాలంటే..
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రతి ఇంటి ముందు తులసి మొక్కను ఉంచుతారు. అలా ఆ మొక్కను ఉంచడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు తులసి మొక్కను సాక్షాత్తు అమ్మవారి రూపంగా కొలుస్తారు. ఇక తులసి ఆకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు. అందులో భాగంగా తులసి ఆకులను ప్రతి ఒక్కరు ఎప్పుడో అప్పుడు తింటారు. అలాగే ఈ ఆకులను టీ, కషాయంతోపాటు మందుల తయారీలో సైతం విస్తృతంగా వినియోగిస్తారు. ఈ విషయం అందరికి తెలిసిందే.
తులసి ఆకుల్లో (Tulsi Leaves) విటమిన్ సి, జింక్, ఐరన్, కాల్షియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) సైతం పెంచుతాయని పేర్కొంటారు. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తులసి ఒక రకంగా చెప్పాలంటే.. వైరస్, బ్యాక్టీరియాల నుంచి మన శరీరానికి రక్షణనిస్తుంది. ఈ ఆకులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందవల్ల దగ్గు, జలుబు, జర్వం తదితర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అత్యధిక శాతం మంది.. ఈ తులసి ఆకుల కషాయాన్ని తాగుతారు.
అయితే తులసి ఆకులు నేరుగా నమలడం వల్ల దంత, జీర్ణ సమస్యలు వస్తాయని (Dental and digestive problems) ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తులసి ఆకులను నేరుగా నమలడం వల్ల.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. అంటే ఈ ఆకులను నేరుగా నమలడం వల్ల దంత, జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తులసి ఆకులను కషాయం లేదా టీతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
తులసి ఆకులలో ఉండే కొన్ని ఖనిజాలు ముఖ్యంగా పాదరసం, ఇనుము.. దంతాలకు హాని చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. వీటిని తరచూ నమలడం వల్ల దంతాలు బలహీనపడి పసుపు రంగులోకి మారతాయని అంటున్నారు. అలాగే చిగుళ్ల సమస్యలతోపాటు నోటి దుర్వాసన సైతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఆకులను అధికంగా తినడం వల్ల తీవ్రమైన దంత సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.
ఒక్కొక్కసారి కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. సహజ ఔషధమైన తులసిని సరైన రీతిలో వినియోగించకుంటే.. ఈ తరహా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఆకులను నేరుగా నమలడానికి బదులు.. వాటిని నీటిలో మరిగించి కషాయంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల తులసిలోని పోషకాలు శరీరానికి చేరతాయని.. తద్వారా రోగనిరోధకశక్తిని పెంచుతాయని చెబుతారు. దీంతో జీర్ణవ్యవస్థ, దంతాలపై ప్రభావం సైతం చూపవని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Drinking Tea Empty Stomach: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..
Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు..