lice prevention: తలలో పేలు పోవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు..
ABN , Publish Date - Oct 03 , 2025 | 09:03 AM
చాలా మందిని తలలో పేలు ఇబ్బంది పెడుతుంటాయి. మరి ముఖ్యంగా మహిళలను. వీటిని ఈ సింపుల్ చిట్కాలతో పొగొట్ట వచ్చని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు.
తలకు పేలు పడితే మాములు చిరాకు కాదు.. కంపరంగా ఉంటుంది. ఒక్కసారి అవి వచ్చాయంటే అంత సులువగా వదిలిపోవు. పైగా తలలో రోజురోజుకు అవి పెరుగుతూ ఉంటాయి. వాటిని నియంత్రించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి మళ్లీ మళ్లీ పుట్టుకొస్తునే ఉంటాయి.
తలకు పేలు ఎక్కితే.. వెంట్రుకలు దెబ్బతింటాయి. జుట్టు సైతం బాగా రాలిపోతుంది. తలలో దురద సైతం పెడుతుంది.
తలలో పేలు పొగట్టేందుకు..
సాధారణంగా జుటు పొడిగా ఉన్నప్పుడు దువ్వుతుంటారు. కానీ పేలు పోవాలంటే మాత్రం .. ముందుగా జుట్టును తడి చేసుకోవాలి. ఏదైనా కండీషనర్ వినియోగించి తడి చేయాలి. ఆ తర్వాత తలను దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో పేలు తొలగించుకోవచ్చు.
పేలు పోవాలంటే.. తరచూగా షాంపూ లేదా కండీషనర్‌తో తలస్నానం చేయాలి. జుట్టు శుభ్రంగా ఉంటే పేలు పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మీ దువ్వెన, హెయిర్ బ్రష్ వంటివి మరొకరికి ఇవ్వవద్దు. అలా ఇవ్వడం వల్ల.. వారి తలలో పేలు వాటి ద్వారా మీకు వచ్చి చేరతాయి. ఈ తరహా జాగ్రత్తలు పాటిస్తే పేలును సులభంగా తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Drinking Tea Empty Stomach: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..
Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు..