Share News

Ragi vs Oats: రాగులు vs ఓట్స్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది?

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:29 PM

రాగులు, ఓట్స్ రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ, ఈ రెండింటిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Ragi vs Oats: రాగులు vs ఓట్స్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది?
Ragi vs Oats

ఇంటర్నెట్ డెస్క్: ఉదయం తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్, ప్రోటీన్ల స్థాయి బట్టి రక్తంలో గ్లూకోజ్ ఎంత త్వరగా పెరుగుతుందో తెలుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగిన ఆహారాలు, అంటే ఓట్స్, తృణధాన్యాలు వంటివి ఎంచుకోవడం, పీచు పదార్థాలు, ప్రోటీన్ తీసుకోవడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. రాగులు, ఓట్స్ రెండూ ఆరోగ్యకరమైనవే కానీ, ఈ రెండింటిలో మధుమేహం ఉన్నవారికి ఏది ఎక్కువ ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


రాగులు

రాగులు (ఫింగర్ మిల్లెట్) భారతదేశంలో ఎక్కువగా పండించే ఒక ముఖ్యమైన చిరుధాన్యం. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిదని అంటారు. రాగి జావను ఉదయం తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులతో జావ, సంగటి వంటివి తయారు చేసి తింటారు. అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా ఇది మంచిదని చెబుతారు. వీటిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచవు. అయితే, రాగిని ఎలా వండుతారన్నది చాలా కీలకం. రాగి దోస, రాగి గంజి వంటివి చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.


ఓట్స్

ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఈ జెల్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా, స్థిరంగా విడుదల అవుతాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడాన్ని నిరోధిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.


ఏది బెటర్?

మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగులు, ఓట్స్ రెండూ మంచివే. అయితే వాటి రకం, తయారుచేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ ప్రాసెస్ చేసిన ఓట్స్ మధుమేహానికి చాలా మంచివి. అయితే రాగులలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కానీ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు. మధుమేహ నియంత్రణకు ఫైబర్ అధికంగా ఉండే, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలను ఎంచుకోవడం ముఖ్యం. కాబట్టి మీరు ఎంచుకున్న ఓట్స్ లేదా రాగులు ఎలా వండుతారనేది చాలా ముఖ్యం.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

హైదరాబాద్‌లో ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం..

For More Latest News

Updated Date - Sep 06 , 2025 | 04:37 PM