Radish Food Combination: ముల్లంగిని వీటితో కలిపి అస్సలు తినకండి..
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:50 PM
శీతాకాలంలో ముల్లంగి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ముల్లంగితో వీటిని కలిపి అస్సలు తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ ఆరోగ్యం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముల్లంగిలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అయితే, కొన్ని ఆహారాలను ముల్లంగితో కలిపి తినకూడదు. ఎందుకంటే అవి ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. చాలా మంది తెలియకుండానే ఈ ఆహారాలను ముల్లంగితో కలిపి తీసుకుంటారు.
ముల్లంగితో లేదా ముల్లంగి తిన్న తర్వాత పాలు, పెరుగును తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ముల్లంగి చల్లదనాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. పాలు, పెరుగు వేడెక్కేలా చేస్తాయని వివరిస్తున్నారు. అందువల్ల, వాటిని కలిపి తినకూడదని చెబుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది జీర్ణ, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అలాగే.. దగ్గు, జలుబు, తలనొప్పి, మైగ్రేన్లు, ఉబ్బసం ఉన్నవారు కూడా దీనిని తినకూడదు. సాధారణ వ్యక్తులు కూడా దీనిని పరిమిత పరిమాణంలో తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
కోపంలో గట్టిగా అరిచే అలవాటు ఉందా? జాగ్రత్త.!
ఈ 5 అలవాట్లు మెదడుకు ఔషధంలా పనిచేస్తాయి..
For More Latest News