Eggs for Vitamin D: చలికాలంలో విటమిన్ డి కోసం రోజూ ఎన్ని గుడ్లు తినాలి?
ABN , Publish Date - Nov 23 , 2025 | 08:07 PM
శీతాకాలంలో శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఈ సీజన్‌లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపిస్తుంది. కాబట్టి, చలికాలంలో విటమిన్ డి కోసం రోజూ ఎన్ని గుడ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి సహజంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది, కానీ శీతాకాలంలో పగటి వెలుగు సమయం తగ్గిపోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి ఉత్పత్తి కాదు. దీని వల్ల నిరంతర అలసట, ఎముకల నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయితే, చలికాలంలో విటమిన్ డి కోసం గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, రోజూ ఎన్ని గుడ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే అవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, విటమిన్ డిను అందిస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో గుడ్లు ఎంతగానో సహాయపడతాయి. గుడ్లు ప్రోటీన్, విటమిన్ డి, జింక్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినడం మంచిది. అయితే, వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. అల్పాహారంగా గుడ్లు తీసుకోవడం వల్ల రోజంతా శక్తిని అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత కండరాల బలానికి లేదా రాత్రిపూట కండరాల పునరుద్ధరణకు కూడా ఇవి చాలా మంచివి.
ఇవీ చదవండి:
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ