Chemicals In Dry Fruits: బాదం, వాల్‌నట్, జీడిపప్పుల్లో ప్రమాదకర రసాయనాలు.. కల్తీని ఇలా గుర్తించండి.!
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:40 AM
వాల్‌నట్స్, జీడిపప్పు, బాదం వంటి గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కానీ వాటిలో రసాయనాలు ఉంటే, అవి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. కాబట్టి, కల్తీ వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలను చాలా మంది రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. క్రమం తప్పకుండా గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగడమే కాకుండా గుండె, మెదడుకు కూడా మేలు జరుగుతుంది. ఇది జుట్టు, చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం గింజలు తినడం వల్ల శక్తి కూడా పెరుగుతుంది. కానీ, నాణ్యత లేని గింజలు తీసుకోవడం, రసాయనాలు కలిగిన సింథటిక్ పాలిష్ వంటివి ఎక్కువ కాలం తింటే అవి కాలేయం, మూత్రపిండాలకు కూడా హాని కలిగిస్తాయి. మీరు మార్కెట్ నుండి కొనుగోలు చేసే జీడిపప్పు, బాదం లేదా వాల్‌నట్‌లు కల్తీగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీడిపప్పులో కల్తీని ఎలా గుర్తించాలి?
మార్కెట్‌లో జీడిపప్పు తీసుకునేటప్పుడు ముందుగా ఒకటి తీసుకుని దానిని నమలడం ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. జీడిపప్పు పళ్లకు అంటుకుంటే అవి నకిలీవని అర్థం. కాబట్టి, వాటిని కొనకండి. నిజమైన జీడిపప్పు పళ్లకు అంటుకోదు. అలాగే, జీడిపప్పు రంగును బట్టి కూడా గుర్తించవచ్చు. పసుపు కలర్‌లో ఉన్న జీడిపప్పు నకిలీవై ఉంటాయి. తెల్లగా ఉన్న జీడిపప్పు నిజమైనవి. మచ్చలు ఉన్న జీడిపప్పును కూడా కొనకండి. అలాగే, చౌకగా ఉన్నవాటిని తీసుకుని మోసపోకండా దాని నాణ్యత చెక్ చేసుకుని తీసుకోండి. పాలిష్ చేసిన జీడిపప్పుకు మెరుపు ఉంటుంది.

బాదంపప్పులో కల్తీని ఎలా గుర్తించాలి
బాదం పప్పులో కల్తీని గుర్తించాలనుకుంటే దాని తొక్కను చూడండి. ఎందుకంటే దానిపై పూత పూయబడి ఉంటే దాని ఉపరితలం మెరుస్తూ, మృదువుగా కనిపిస్తుంది. అయితే నిజమైన బాదం పప్పు ఉపరితలం కొద్దిగా గరుకుగా ఉంటుంది. మీరు బాదం పప్పును నీటిలో నానబెట్టండి. కొంత సమయం తర్వాత నీటిలో రంగు కనిపిస్తే అవి నకిలీవని అర్థం. మీరు బాదం పప్పును రుచి చూడటం ద్వారా తనిఖీ చేయవచ్చు. రుచిలో చేదు లేదా ఏదైనా సమస్య ఉంటే వాటిని కొనకండి. మార్కెట్‌లో నూనె లేని పాత బాదం పప్పును అమ్ముతారు. అందుకే బాదం పప్పును పగలగొట్టి, గట్టిగా నొక్కడం ద్వారా చెక్ చేసుకోండి.

వాల్‌నట్స్‌లో కల్తీని గుర్తించండి
సాధారణంగా మీరు వాల్‌నట్‌లను వదులుగా అంటే తొక్క తీసి కొనుగోలు చేస్తే వాటిలో కల్తీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజమైన వాల్‌నట్‌ల రంగు లేత బంగారు రంగులో ఉంటుంది. వాటి సువాసన చాలా తాజాగా ఉంటుంది. వాసన చూడటం, రుచి చూడటం ద్వారా మీరు దీన్ని చెక్ చేయవచ్చు. అవి చేదుగా అనిపిస్తే అస్సలు కొనకండి. మీరు వాల్‌నట్‌లను షెల్‌తో కొనుగోలు చేస్తుంటే, దాని బరువును తనిఖీ చేయండి. అది బరువుగా అనిపిస్తే, దాని షెల్ మందంగా ఉంటుంది. లోపల విత్తనం బాగా బయటకు రాదు. మరోవైపు, పేపర్ వాల్‌నట్‌లు తేలికగా ఉంటాయి. వాటిని చేతితో పగులగొట్టవచ్చు.

(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For MOre Latest News