Share News

Chanakya Niti On Money: ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. డబ్బు‌కు ఏ మాత్రం కొరత ఉండదు.!

ABN , Publish Date - Oct 22 , 2025 | 09:50 AM

చాలా మంది కష్టపడి పనిచేసినా డబ్బు సరిపోదని భావిస్తారు. అయితే, డబ్బు కొరతను నివారించడానికి కొన్ని సూత్రాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. చాణక్యుడి చెప్పిన ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti On Money: ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. డబ్బు‌కు ఏ మాత్రం కొరత ఉండదు.!
Chanakya Niti On Money

ఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు ఎంత సంపాదించినా డబ్బు సరిపోదు. ముఖ్యంగా నేటి ఖరీదైన ప్రపంచంలో ఎంత పనిచేసినా డబ్బు ఆదా చేయలేని పరిస్థితి ఏర్పడింది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే, డబ్బు కొరతను నివారించడానికి కొన్ని సూత్రాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. చాణక్యుడి చెప్పిన ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నిజాయితీగా డబ్బు సంపాదించండి:

చాణక్యుడి ప్రకారం, నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి, అడ్డమైన దారుల్లో కాకుండా డబ్బును కష్టపడి సంపాదించడం ముఖ్యం. అలా కాకుండా అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తే, అది ఏదో ఒక విధంగా మీ నుండి దూరమవుతుంది. కాబట్టి, నిజాయితీగా డబ్బు సంపాదించండి.

Money.jpg


ప్రణాళిక వేయండి: మీరు ధనవంతులు కావాలనుకుంటే డబ్బుకు సంబంధించి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఆ ప్రణాళిక ప్రకారం డబ్బు ఆదా చేసి ఖర్చు చేయండి. వీలైనంత వరకు వృధా ఖర్చులను నివారించండి. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఈ విధంగా, భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసే వ్యక్తికి డబ్బు సమస్యలు ఉండవు.

పనికిరాని వస్తువులకు ఖర్చు చేయకండి: మీ దగ్గర డబ్బు ఉంటే, దానిని తెలివిగా ఖర్చు చేయాలి. కష్టపడి సంపాదించిన డబ్బును పనికిరాని వస్తువులకు ఖర్చు చేయకూడదు. కాబట్టి, డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. ఎక్కువ భాగాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి.


ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 01:20 PM