Chanakya Niti: చాణక్యుని వార్నింగ్.. ఇలాంటి వారికి సాయం చేస్తే మీకే నష్టం!..
ABN , Publish Date - Aug 08 , 2025 | 08:47 PM
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. వివాహ జీవితం, విజయవంతమైన జీవితం, ఎవరితో స్నేహితులుగా ఉండాలి, మన శత్రువుల విషయంలో ఎలా వ్యవహరించాలి.. ఇలా జీవితానికి సంబంధించిన సూక్ష్మ విషయాల గురించి ఆయన అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. అదేవిధంగా, జీవితంలో మనం ఎలాంటి వ్యక్తులకు సహాయం చేయకూడదో కూడా చెప్పారు. చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తులకు ఎప్పటికీ సహాయం చేయకూడదో చూద్దాం.
దాతృత్వం, కష్టాల్లో ఉన్నవారిక సహాయం చేయడం మానవులకు ఉండే సహజ లక్షణం. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న ప్రజలకు ఏదో ఒక విధంగా సాయం చేసుకుంటారు. వాస్తవానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉత్తమ లక్షణం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాలనే ఆలోచనను ఎవరూ తప్పుపట్టరు. కానీ ఇలా అందరికీ సహాయం చేయడమే మంచిది కాదు. అవును, ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఎవరికి సహాయం చేయకూడదు.. ఎందుకు చేయకూడదని చెబుతున్నాడో వివరంగా తెలుసుకోండి.
కష్ట సమయాల్లో ఎవరికైనా సహాయం చేయడాన్ని పుణ్యకార్యం అనే అంటారు. కానీ ఆలోచించకుండా ఎవరికీ సహాయం చేయకండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ప్రశాంతతను దెబ్బతీస్తుంది అని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.
దురాశపరులు
చాణక్యుడి ప్రకారం దురాశపరుడికి ఎప్పుడూ సహాయం చేయకూడదు. వారు తమ స్వార్థం కోసం మీ నుండి సహాయం కోరే అవకాశం ఉంది. వారు మిమ్మల్ని తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. దీని కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి దురాశపరులకు ఎన్నటికీ సహాయం చేయకండి. బదులుగా వారి నుండి దూరంగా ఉండటం మంచిది.
అబద్ధాలకోరు
ఆచార్య చాణక్యుడి ప్రకారం, అబద్ధం చెప్పే వారికి మనం సహాయం చేయకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పి మీ నుండి సహాయం కోరే అవకాశం ఉంది.
సోమరులు
కష్టపడి పనిచేయడానికి ఇష్టపడని సోమరిపోతులకు సహాయం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారికి సహాయం చేయడం వల్ల మీ డబ్బూ, సమయం రెండూ వృథా అవుతాయి.
రెండు ముఖాలు ఉన్న వ్యక్తులు
మీ ముందు మిమ్మల్ని పొగిడి.. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడే రెండు ముఖాలు ఉన్న వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదు. ఇలాంటి వారికి పొరపాటున కూడా సహాయం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు.
కృతజ్ఞత లేని వారు
మీ సహాయానికి విలువ ఇవ్వని వారికి ఎప్పుడూ సహాయం చేయకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు చాలా స్వార్థపరులు. వారు మీకు అవసరమైన సమయంలో నట్టేట ముంచి పోతారు. కాబట్టి కృతజ్ఞత లేని వారికి సహాయం చేసి అనవసర కష్టాలు, బాధలు కొని తెచ్చుకోకండి.
మోసగాళ్లు
అబద్ధాలు చెప్పేవారికి, నిజాయితీ లేనివారికి సహాయం చేయకండి. మీరు వారికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే మీరు అలాంటి వారికి సహాయం చేస్తే మీరు ప్రమాదంలో పడవచ్చు.
వ్యసనపరులు
మద్యం, జూదం మొదలైన వాటికి, చెడు అలవాట్లకు బానిసలైన వారికి సహాయం చేయవద్దు. మీ సహాయం వారి జీవితాలను మెరుగుపరచదు. అలాంటి వారికి సహాయం చేయడం వ్యర్థం. మీరు వీలైనంత వరకు వారి సహవాసానికి దూరంగా ఉండాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఈ వార్తలు కూడా చదవండి..
వర్షాకాలంలో తడి బట్టల టెన్షన్‌కు గుడ్ బై చెప్పండిలా!
ప్రతి ఒక్క విద్యార్థి తప్పక చదవాల్సిన కలాం సూక్తులు!
Read Latest Telangana News and National News