Share News

Festival Shopping Tips: పండుగ టైంలో ఇలా స్మార్ట్‌గా షాపింగ్ చేయండి.. మనీ సేవ్ చేసుకోండి

ABN , Publish Date - Aug 23 , 2025 | 09:54 PM

వచ్చే నెలల్లో వరుస పండుగలు ఉన్నాయి. వినాయక చవితి నుంచి దసరా, దీపావళి, క్రిస్మస్ వరకు పండుగలే పండుగలు. ఈ సందర్భంగా షాపింగ్ కోసం ఆర్థిక భారం పెంచుకోకుండా, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఖర్చును నిమంత్రించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.

Festival Shopping Tips: పండుగ టైంలో ఇలా స్మార్ట్‌గా షాపింగ్ చేయండి.. మనీ సేవ్ చేసుకోండి
Festival Shopping Tips

వచ్చే నెలల్లో వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగలు ఉన్నాయి. దీంతో అనేక మంది షాపింగ్ పేరుతో తెగ ఖర్చు చేస్తుంటారు. కొత్త బట్టలు, గిఫ్ట్‌లు, డెకరేషన్స్, గాడ్జెట్స్ సహా అనేకం కొంటుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మీ ఖర్చులు తగ్గించుకోవచ్చని నిపుణులు (Festival Shopping Tips) చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. ముందే బడ్జెట్ సిద్ధం చేసుకోవడం

పండుగల వేళ హ్యాపీగా షాపింగ్ చేయాలనిపిస్తుంది. కానీ, మన వాలెట్‌ను కూడా హ్యాపీగా ఉంచాలంటే, ముందే బడ్జెట్ గురించి ప్లాన్ చేసుకోవాలి. బట్టలు, గిఫ్ట్స్, డెకరేషన్స్, ఫుడ్, ట్రావెల్ ఇలా విభాగాల వారీగా మీ ఖర్చును ప్లాన్ చేయాలి. అప్పుడే మీ షాపింగ్‌లో ఖర్చు అదుపు తప్పకుండా ఉంటుంది.


2. అవసరాలకే ప్రాధాన్యం

ఇది కావాలా లేక కావాలనిపిస్తోందా? ప్రతి వస్తువు కొనేటప్పుడు మీరు మరోసారి ఆలోచించండి. అవసరమైన వాటిని మొదట తీసుకోండి. లగ్జరీ లేదా డిజైన్ బట్టలు వంటివి బడ్జెట్‌లో లేకపోతే తర్వాత కూడా కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చివరకు మీ ఖర్చులు తగ్గిపోతాయి.

3. ధరలను పోల్చండి

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో చాలా డీల్స్ ఉంటాయి. కానీ, కొన్ని సార్లు స్థానిక షాపుల్లో మంచి ఆఫర్లు దొరకవచ్చు. ఒక వస్తువు కొనే ముందు రెండు, మూడు వెబ్‌సైట్లు చూసి ధరలను తెలుసుకోండి. మీ దగ్గరున్న దుకాణాల్లోనూ చర్చించండి. ఎక్కడ తక్కువగా ఉందో నిర్ణయించుకుని చివరకు కొనుగోలు చేయండి.


4. క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్

మీరు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో షాపింగ్ చేస్తున్నారా. అయితే బ్యాంక్ ఆఫర్లు తప్పకుండా వినియోగించుకోండి. ఫెస్టివల్ టైంలో ఎక్కువగా cashback, EMI ఆఫర్లు, extra discountలు ఉంటాయి. ఇవి వాడుకుని కొంత వరకూ మీ ఖర్చులను తగ్గించుకోవచ్చో తెలుసుకోండి.

5. క్రెడిట్ కార్డు మీద ఎక్కువగా ఆధారపడొద్దు

ఆఫర్లు, డీల్స్ ముచ్చటగా అనిపించవచ్చు. కానీ మళ్లీ చెల్లింపు చేసే సామర్థ్యాన్ని మించిపోయేలా కార్డు వినియోగించకండి. వడ్డీ (interest) భారం క్రమంగా పెరుగుతుంది. అప్పుడు మీరు తీసుకున్న డిస్కౌంట్ కన్నా ఎక్కువ ఖర్చవుతుంది.


6. ముందుగానే షాపింగ్

పండుగ సమయానికి దగ్గర అవుతున్నకొద్దీ ధరలు కూడా పెరుగుతుంటాయి. బట్టలు, గిఫ్ట్లు, డెకరేషన్ సామాగ్రి మొదలైనవి ముందే కొనుగోలు చేస్తే ధర తక్కువగా ఉంటుంది. మంచి ఆప్షన్లు కూడా లభిస్తాయి.

7. బల్క్‌లో కొనండి

మీరు తినే స్వీట్లు, గిఫ్ట్లు, డెకరేషన్ ఐటమ్స్ లాంటివి కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్‌తో కలిసి బల్క్‌లో తీసుకుంటే తక్కువకు వస్తాయి. చాలా ఆన్‌లైన్ వెబ్‌సైట్లు బల్క్ పర్చేస్‌లకు ప్రత్యేక డీల్స్ ఇస్తుంటాయి.

స్నేహితులతో కలిసి..

పండుగలు అంటే ఖర్చు మాత్రమే కాదు. కుటుంబం, స్నేహితులతో కలిసి ఆనందించడమే అసలైన ఉత్సవం. మీరు కూడా ఈసారి కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుని, స్మార్ట్ షాపింగ్ చేసి, మిగిలిన సమయాన్ని ఎంజాయ్ చేయండి.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 09:54 PM