Share News

UK And Canada Recognise Palestine: పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూకే, కెనడా

ABN , Publish Date - Sep 21 , 2025 | 07:52 PM

మధ్యప్రాశ్చంలో సుస్థిర శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానానికి ఒట్టావా మద్దతిస్తోందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు 'సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, సుస్థిర పాలస్తీనా' ఏర్పాటు కీలకమని పేర్కొంది.

UK And Canada Recognise Palestine: పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూకే, కెనడా
Palestine

లండన్: చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. పాలస్తీనా (Palestine)ను ప్రత్యేక దేశంగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK), కెనడా (Canada) ఆదివారం నాడు అధికారికంగా గుర్తించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ యూకే, కెనడా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


మధ్యప్రాశ్చంలో సుస్థిర శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానానికి ఒట్టావా మద్దతిస్తోందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు 'సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, సుస్థిర పాలస్తీనా' ఏర్పాటు కీలకమని పేర్కొంది.


హమాస్, ఇజ్రాయెల్‌పై విమర్శలు

హమాస్, టెల్ అవివ్‌పై కెనడా పీఎం కార్యాలయం విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్‌లో హమాస్ భయోత్పాతం సృష్టిస్తే, గాజా ప్రజల 'అణచివేత'కు ఇజ్రాయెల్ పాల్పడిందని పేర్కొంది. అక్టోబర్ 7 దాడిలో బందీలుగా పట్టుకున్న వారిని విడుదల చేయాలని హమాస్‌కు విజ్ఞప్తి చేసింది. పాలస్తీనా స్థాపనను నిరోధించేందుకు టెల్ అవివ్ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ వచ్చిందని విమర్శించింది. గాజాలో వేలాది మంది పౌరులను హతమార్చి, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని తప్పుపట్టింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో నిర్దేశించిన ప్రాథమిక మానవ హక్కులు, కెనడా దశాబ్దాలుగా అనుసరిస్తున్న నిలకడైన విధానానికి అనుగుణంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది.


శాంతి దిశగా..

పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొంటుందనే ఆశాభావంతో పాలస్థీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. మధ్యప్రాశ్చంలో శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానం అవసరమని తెలిపారు. ద్విదేశ విధానంతో ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండటంతోపాటు సుస్థిర పాలస్తీనా సాధ్యమని అన్నారు.


ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌పై మళ్లీ విషం కక్కిన షెహబాజ్

హెచ్-1బీ వీసాదారులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ భారీ ఆపరేషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 08:43 PM