India Economic Opportunity: చైనాతో అమెరికా వాణిజ్యం యుద్ధం.. ఈ ఛాన్స్ భారత్ ఉపయోగించుకుంటుందా..
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:31 PM
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్ ప్రపంచ కర్మాగారంగా మారుతుందా. చైనాకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటుందా. అందుకోసం ఇండియా సిద్ధంగా ఉందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలో ట్రంప్ మామ వచ్చిన తర్వాత తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మాకు అమెరికానే ముఖ్యమని, ఇప్పటివరకు మా ఆదాయాన్ని ఇతర దేశాలు భారీగా దోచుకున్నాయన్నారు. అంతేకాదు ఇకపై అలాంటి ఆటలు సాగవన్నారు. ఈ క్రమంలో అమెరికాకు వచ్చే ప్రతి వస్తువుపై కూడా సుంకాలు తప్పవని ప్రకటించారు. ఈ క్రమంలోనే అమెరికాకు వచ్చే దిగుమతుల్లో ఎక్కువగా చైనావి ఉండగా, ఈ దేశం నుంచి వస్తువులపై భారీగా సుంకాలను ప్రకటించారు. ఇదే సమయంలో చైనా సైతం వెనక్కి తగ్గకుండా అమెరికా వస్తువులపై పన్నులను విధిస్తోంది.
ఆపిల్ ఇప్పటికే..
దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ మామ చైనాపై సుంకాలను ఏంకంగా 145 శాతానికి పెంచారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య అనేక వస్తువుల మధ్య ఆక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా భారత్ వైపు చూస్తోంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ తయారీని ప్రారంభించి ఎగుమతి చేసుకుంది. చైనాలో వాణిజ్య వార్ నేపథ్యంలో ఇతర వస్తువులు లేదా ఉత్పత్తుల ఇండియా ప్రత్యామ్నాయం అవుతుందా. ఈ పరిణామాలు భారతదేశానికి అనేక అవకాశాలను అందిస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
భారతదేశం సిద్ధంగా ఉందా?
భారతదేశం ఇప్పటికే "మేక్ ఇన్ ఇండియా" వంటి కార్యక్రమాలను ప్రారంభించి, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే, ఈ లక్ష్యాలను సాధించేందుకు మరింత కృషి అవసరమని నిపుణులు చెబుతున్నారు. శ్రామిక నైపుణ్యం, మౌలిక వసతులు, రెడ్ టేప్ వంటి సమస్యలను అధిగమించేందుకు సమగ్ర వ్యూహాలు అవసరమని అంటున్నారు. భారతదేశం ఈ అవకాశాలను సద్వినియోగం చేసేందుకు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు, శ్రామిక శక్తి నైపుణ్యాలపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఇదే సమయంలో అనేక కంపెనీలు పూర్తిగా సిద్ధంగా లేవు. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీకి సిద్ధంగా ఉండాలని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా నిలిపేందుకు అవకాశం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News