H1B : వీసా ఫీజుల పెంపుతో అమెరికా కంపెనీలపైనే అధిక భారం
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:56 PM
ట్రంప్ తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు అమెరికా కంపెనీలపైనే అధిక భారాన్ని మోపుతోంది. ఇది.. ఏటా ఆయా కంపెనీలపై దాదాపు 14 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు ఉంటుందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు(Trump H1B visa fee hike) అమెరికా కంపెనీలపైనే అధిక భారాన్ని మోపుతోంది. ఇది.. ఏటా ఆయా కంపెనీలపై దాదాపు 14 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు ఉంటుందని చెబుతున్నారు. H1B వీసా ఫీజు లక్ష డాలర్లు చేయడం ఆయా సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. ఈ నిర్ణయం అమెరికాలోని స్టార్టప్ సంస్థలకు(US startups impact) అతి పెద్ద భారం కానుందని స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన 'వై కాంబినేటర్' సీఈవో గారీటాన్ అంటున్నారు. అదే సమయంలో విదేశాల్లోని టెక్ హబ్‌లకు ఇది ఓ సానుకూల పరిణామంగా మారుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ట్రంప్ తాజా నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉందని కూడా అమెరికా న్యాయవాదులు అంటున్నారు. వీసాల ఫీజు పెంపు మీద ట్రంప్.. తన అధికారాల పరిధిని దాటి నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనను న్యాయస్థానాలు అడ్డుకొనే అవకాశం ఉందనీ అంచనా వేస్తున్నారు. వీసాలు లాటరీ విధానంలో కాకుండా.. జీతాల ఆధారంగా మంజూరు చేయాలని ఇప్పటికే కొందరు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News