Viral Videos: బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో ఎలాన్ మస్క్..నెట్టింట వీడియోలు వైరల్
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:41 PM
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపులు తిరుగుతుంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై భారీగా 125 శాతం సుంకాలు విధిస్తే, మరోవైపు చైనా కూడా కౌంటర్‌గా 84 శాతం పన్నులతో ప్రతిస్పందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలు వీడియోలతో చైనీయులు అమెరికన్లను ట్రోల్ చేస్తున్నారు.

అమెరికా-చైనా మధ్య ఇంకా వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా దిగుమతులపై ఏకంగా 125 శాతం సుంకాన్ని విధించారు. దీంతోపాటు చైనా కూడా అమెరికా దిగుమతులపై 84 శాతం పన్నులను విధించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ నెటిజన్లు సోషల్ మీడియాలో పలు రకాల ఏఐ క్రియేటర్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ కుట్టుపని..
ఆ వీడియోలలో అమెరికన్లు తెగ కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ కంటెంట్‌లో అధిక బరువు ఉన్న అమెరికన్లు చెమటలు పట్టే పరిస్థితుల్లో పనిచేస్తూ, దుస్తులు కుట్టడం, దిగులుగా ఎలక్ట్రానిక్‌లను అసెంబుల్ చేయడం వంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలు "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అనే నినాదంతో ముగుస్తున్నాయి. ఈ వైరల్ పోస్ట్ "టారిఫ్‌ల హిట్ తర్వాత ట్రంప్ కుట్టుపని" అనే ట్యాగ్ లైన్‌తో ఉంది. ఇది చూసిన పలువురు తయారీని తిరిగి తీసుకురావడం ఎలా ఉంటుందో అమెరికన్లకు చూపించడానికి ఇది బీజింగ్ మార్గమని మరొకరు పేర్కొన్నారు.
కారణమిదేనా..
అయితే పెరుగుతున్న సుంకాల నేపథ్యంలో చైనా నుంచి బట్టలు సహా మొబైల్స్ కూడా అమెరికాకు వెళ్లే అవకాశం తగ్గనుంది. ఆ క్రమంలో అమెరికా ప్రజలే బట్టలు కుట్టుకుని, మొబైల్స్ తయారు చేసుకోవాలని ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోలు చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చైనా కాకపోతే అమెరికా.. భారత్ నుంచి దుస్తులు సహా మొబల్స్ కూడా దిగుమతి చేసుకుంటుందని అంటున్నారు. చైనా పోకడలకు అమెరికా తగ్గాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాణిజ్య సంఘర్షణ
అమెరికా సుంకాల చర్యపై చైనా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ చర్యలను ప్రపంచ ఇష్టానికి విరుద్ధంగా ఉండే స్పష్టమైన చర్య అని ఖండించారు. అమెరికా చర్య నియమాల ఆధారిత ప్రపంచ వాణిజ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఇది క్రమంగా అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వాన్ని బెదిరిస్తుందని లిన్ అన్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనం ఆధారంగా నిర్ణయించుకోవాలన్నారు. వాణిజ్య సంఘర్షణను తీవ్రతరం చేయాలని ఎంచుకుంటే, అది వెనక్కి తగ్గదని ఆయన అన్నారు. చైనా ప్రతిస్పందన చివరి వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Read More Business News and Latest Telugu News