Trump $2000 payment: ఒక్కొక్కరికి రెండు వేల డాలర్లు.. కీలక ప్రకటన చేసిన ట్రంప్..
ABN , Publish Date - Nov 10 , 2025 | 07:19 AM
పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తీరుపై అమెరికా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి.
పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తీరుపై అమెరికా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. కోర్టుల్లో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. అధ్యక్షుడి అధికారాలపై అమెరికా సుప్రీంకోర్టు కూడా సందేహాలు వ్యక్తం చేసింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు (Trump economic policy).
'మనది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. ద్రవ్యోల్బణం లేదు. స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. సుంకాల ద్వారా మనకు లక్షల డాలర్లు వస్తున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్లు రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం. డెవిడెండ్ కింద ఒక్కో అమెరికన్‌కు రెండు వేల డాలర్లు చెల్లిస్తాం' అని ట్రంప్ పేర్కొన్నారు (Trump tariff revenue plan).
'ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు, మనమెందుకు వారిపై విధించకూడదు (U.S. tariffs news). ఈ సుంకాల కారణంగానే చాలా కంపెనీలు అమెరికాలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. జాతీయ ప్రయోజనాల కోసం విదేశాలపై సుంకాలు విధించడం సాధ్యం కాదా? ఇదంతా చాలా హాస్యాస్పదం ఉంది' అని ట్రంప్ మండిపడ్డారు. దిగుమతి సుంకాలను మార్చడం, కొత్తగా విధించడం వంటి అధికారాలు అమెరికా అధ్యక్షుడికి ఉన్నాయా అని సుప్రీంకోర్టు ఇటీవల సందేహాలు వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి