Share News

Trump - Sriram krishnan: శ్వేత సౌధం సలహాదారు శ్రీరామ్ కృష్ణన్‌పై ట్రంప్ ప్రశంసలు! అతడు లేకపోతే..

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:26 AM

శ్వేతసౌధం సలహాదారుగా ఉన్న భారత సంతతి టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఏఐ రంగంలో అమెరికా దూసుకుపోయేలా విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

Trump - Sriram krishnan: శ్వేత సౌధం సలహాదారు శ్రీరామ్ కృష్ణన్‌పై ట్రంప్ ప్రశంసలు! అతడు లేకపోతే..
Trump Praises Sriram Krishnan

ఇంటర్నెట్ డెస్క్: శ్వేత సౌధం సలహాదారు, భారత సంతతికి చెందిన ఐటీ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏఐ రంగంలో చైనాపై పైచేయి సాధించేలా అమెరికా వ్యూహం రూపకల్పనలో, బలోపేతం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ కీలకపాత్ర పోషించారని అన్నారు. శ్వేత సౌధం క్రిస్మస్ పార్టీ సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు (Trump Praises AI Advisor Sriram Krishnan).

ఏఐ రంగంలో చైనాపై పైచేయి సాధించేందుకు శ్వేతసౌధం ఇటీవల కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏఐ అభివృద్ధిని వేగవంతం చేసేలా, దేశీ సంస్థలకు నిబంధనలను మరింత సరళతరం చేసేలా ఈ విధానాన్ని సిద్ధం చేశారు. ఏఐ రంగంలో అమెరికా నెం.1గా ఉండేందుకు, జాతీయ భద్రతకు ప్రభుత్వ సంస్థలు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్లాన్ చేశారు. అత్యాధునిక సాంకేతికతల్లో చైనా కంటే అమెరికా ముందంజలో ఉండాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. దీని రూకల్పనలో శ్రీరామ్ కృష్ణన్ కీలక పాత్ర పోషించారు.


ఈ క్రమంలో ట్రంప్ శ్రీరామ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆయన లేకపోతే ఏఐ అంశాల్లో ఇంత పురోగతి ఉండేది కాదు’ అంటూ శ్రీరామ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా ట్రంప్‌‌కు శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ నాయకత్వం, ఇండస్ట్రీ వర్గాల మద్దతుతో ఇది సాధ్యమైందని అన్నారు. తాజా వ్యూహంతో అమెరికా ఏఐ రంగంలో ప్రపంచంలో నెం.1గా నిలుస్తుందని అన్నారు.

ప్రస్తుత విధానం ట్రంప్ ఆదేశాల ద్వారా అమల్లోకి వచ్చిందన్న కృష్ణన్.. దీన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు అమెరికా చట్టసభల ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

టెక్ ఆంత్రప్రెన్యూర్‌గా, ఇన్వెస్టర్‌గా శ్రీరామ్ కృష్ణన్ అమెరికాలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. గతంలో మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఏఐ రంగానికి సంబంధించి శ్వేత సౌధం సలహాదారుగా సేవలందిస్తున్నారు.


ఇవీ చదవండి:

పరువు పోగొట్టుకుంటున్న పాక్.. సౌదీలో 56 వేల మంది పాక్ యాచకుల బహిష్కరణ

ఐఎమ్ఎఫ్‌తో చిక్కులు.. అధిక కండోమ్స్ ధరలతో పాక్‌ సతమతం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 21 , 2025 | 09:43 AM