Share News

H-1B Visa : 38% తగ్గిన హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:15 AM

అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా ప్రక్రియలో అమలులోకి తెచ్చిన నూతన నిబంధనల ప్రభావంతో ఈసారి రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. 2024లో 7,58,994 రిజిస్ట్రేషన్లు నమోదవగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి

H-1B Visa : 38% తగ్గిన హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లు

న్యూఢిల్లీ, జనవరి 29: అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా ప్రక్రియలో అమలులోకి తెచ్చిన నూతన నిబంధనల ప్రభావంతో ఈసారి రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. 2024లో 7,58,994 రిజిస్ట్రేషన్లు నమోదవగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి సంఖ్య 4,79,953కు పడిపోయింది. అంటే దాదాపు 38 శాతం తగ్గుదల నమోదైంది. తాజా దరఖాస్తుల్లో 4,70,342 అర్హత కలిగినవిగా అమెరికా పౌరసత్వ, వలసల విఽభాగం (యూఎ్‌ససీఐఎస్‌) గుర్తించింది. గతంలో ఒకే అభ్యర్థి కోసం పలువురు యజమానులు రిజిస్ట్రేషన్లు సమర్పించే అవకాశం ఉండేది. దీంతో ఉద్యోగికి వీసా మంజూరయ్యే అవకాశాలు గణనీయంగా పెరిగేవి. అయితే సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి ఒక్క రిజిస్ట్రేషన్‌ను మాత్రమే అనుమతిస్తారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:15 AM