Share News

Donald Trump: చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు.. నాటో దేశాలకు ట్రంప్ పిలుపు

ABN , Publish Date - Sep 13 , 2025 | 07:14 PM

ఒక గ్రూపుగా నాటో దేశాలు చైనాపై విధించే 50 శాతం నుంచి 100 శాతం సుంకాలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియగానే పూర్తిగా ఉపసంహరించుకోవచ్చని, ఈ చర్య యుద్ధం ముగియడానికి గొప్ప సహకారి అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump: చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు.. నాటో దేశాలకు ట్రంప్ పిలుపు
Donald trump

వాషింగ్టన్: భారత్, రష్యాలను చైనా కోల్పోయినట్టు కనిపిస్తోందంటూ ఇటీవల తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వ్యంగ్య పోస్టులు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) తాజాగా డ్రాగెన్‌ దేశంపై కన్నెర్ర చేస్తున్నారు. రష్యాపై డ్రాగెన్ పట్టును బలహీన పరిచేందుకు చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలని, అప్పుడే ఉక్రెయిన్‌తో యుద్ధానికి తెరపడుతుందని నాటో (NATO) దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేయాలని, రష్యాపై కీలక ఆంక్షలు విధించాలని నాటో దేశాలకు శనివారం నాడు ఒక లేఖ కూడా రాశారు ట్రంప్.


'నాటో దేశాలన్నీ అంగీకరిస్తే రష్యాపై కీలక ఆంక్షలు విధించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. రష్యా నుంచి నాటో దేశాలు చమురు కొనుగోలును ఆపేయాల్సి ఉంటుంది' అని సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ సూచించారు. ఒక గ్రూపుగా నాటో దేశాలు చైనాపై విధించే 50 శాతం నుంచి 100 శాతం సుంకాలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియగానే పూర్తిగా ఉపసంహరించుకోవచ్చన్నారు. ఈ చర్య యుద్ధం ముగియడానికి గొప్ప సహకారి అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.


రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మూడో పెద్ద దేశంగా నాటో సభ్య దేశమైన తుర్కియా ఉంది. చైనా, భారత్ మొదటి రెండు దేశాల్లో ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇతర నాటో దేశాల్లో హంగేరి, స్లోవాకియా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి...

భారత్, చైనాలపై మరిన్ని సుంకాలు.. అంగీకరించిన జీ7 దేశాలు?

త్వరలో భారత్‌కు ట్రంప్‌!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 08:36 PM