Share News

G7 tariffs on India: భారత్, చైనాలపై మరిన్ని సుంకాలు.. అంగీకరించిన జీ7 దేశాలు?

ABN , Publish Date - Sep 13 , 2025 | 09:59 AM

ఇప్పటికే అమెరికా విధించిన 50 శాతం సుంకాలతో సతమతమవుతున్న భారత్‌పై మరో పిడుగు పడనుందా? ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని జీ7 దేశాలు భావిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

G7 tariffs on India: భారత్, చైనాలపై మరిన్ని సుంకాలు.. అంగీకరించిన జీ7 దేశాలు?
G7 tariffs India

ఇప్పటికే అమెరికా విధించిన 50 శాతం సుంకాలతో సతమతమవుతున్న భారత్‌పై మరో పిడుగు పడనుందా? ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని జీ7 దేశాలు భావిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత్, చైనాలపై పన్నులు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న ఒత్తిడికి జీ7 దేశాలు తలొగ్గినట్టు సమాచారం. భారత్, చైనాలపై సుంకాలను పెంచేందుకు జీ7 దేశాలు సూచన ప్రాయంగా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి (G7 India tariffs).


కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా జీ7 దేశాల భాగస్వాములు. ఈ దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో వారి మధ్య సుంకాల విధింపునకు సంబంధించిన చర్చ వచ్చింది (proposed sanctions India). ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు నిజంగా కట్టుబడి ఉంటే రష్యా నుంచి ముడి చమురు కొంటూ పరోక్షంగా సహాయం చేస్తున్న భారత్, చైనాలపై సుంకాలు విధించాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు (Trade tensions India Russia oil).


అమెరికా ఒత్తిడి మేరకు భారత్, చైనాలపై సుంకాలు విధించేందుకు ఆయా దేశాలు అంగీకరించినట్టు సమాచారం (India‑G7 trade policy). ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు తామంతా కట్టుబడి ఉన్నామని జీ7 దేశాల సభ్యులు తీర్మానం చేశారు. భారత్‌పై సుంకాల పెంపునకు సంబంధించి ఇప్పటివరకు జీ7 దేశాల నుంచి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఆయా దేశాలు కూడా సుంకాల పెంపునకు సిద్ధపడితే భారత్‌కు మరింత క్లిష్టపరిస్థితులు తప్పవు.


ఇవి కూడా చదవండి:

కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు

సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 09:59 AM