H1B Visa News: H-1B వీసా విధానంపై పిటిషన్లు.. సమర్థించుకోవడానికి సిద్ధమవుతున్న వైట్‌హౌస్..
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:09 PM
అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ప్రాధాన్యత ఎల్లప్పుడూ అమెరికన్ కార్మికులను ముందు ఉంచడం, మన వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అని అధికారులు వ్యాఖ్యనించారు.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త వీసా దరఖాస్తుదారులపై విధించిన $100,000 రుసుమును సవాలు చేస్తూ అనేక కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో ట్రంప్ పరిపాలన తన కొత్త H-1B వీసా విధానాన్ని కోర్టులో సమర్థించుకోవడానికి సిద్ధమవుతోంది. H-1B వ్యవస్థను దోపిడీ చేస్తున్నారని, దీనివల్ల అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు. కొత్త విధానం అమెరికన్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం, H-1B వ్యవస్థలో మోసాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు స్పష్టం చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ప్రాధాన్యత ఎల్లప్పుడూ అమెరికన్ కార్మికులను ముందు ఉంచడం, వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అని అధికారులు వ్యాఖ్యనించారు. చాలా కాలంగా, H-1B వీసా వ్యవస్థ మోసాలతో నిండి ఉందన్నారు. అది అమెరికన్ల వేతనాలను తగ్గటానికి దారీ తీసిందని పేర్కొన్నారు. కాబట్టి అధ్యక్షుడు ఈ వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నారని చెప్పారు. ఈ చర్యలు చట్టబద్ధమైనవి, అవి అవసరమని ఉద్ఘాటించారు. తాము ఈ విధానంపై కోర్టులో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
H-1B వీసాపై విధించిన $100,000 రుసుమును సవాలు చేస్తూ.. యూనియన్లు, మతపరమైన సమూహాలు కాలిఫోర్నియా, వాషింగ్టన్, DC, ఫెడరల్ కోర్టులలో పటిషన్‌లు దాఖలు అయ్యాయి. ఈ రుసుము చట్టవిరుద్ధమని US పరిశ్రమలకు హాని కలిగిస్తుందని వారు వాదిస్తున్నారు. ఎందుకంటే ఇది H-1B వీసాని నియంత్రించే ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టంలోని నిబంధనలను అధిగమిస్తుందని వారు భావిస్తున్నారు. మరోవైపు వీసాలను ప్రాసెస్ చేయడంలో ప్రభుత్వం చేసే ఖర్చుల ఆధారంగా రుసుములు ఉండాలనే నిబంధనతో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అమెరికాలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి చాంబర్ సభ్యులు ఈ ప్రతిపాదనలకు మద్దతు ఇచ్చారు. ఈ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థకు తక్కువ కాదని తెలిపారు. ముఖ్యంగా, యూనియన్లు, విద్యావేత్తలు, మతపరమైన సమూహాలు ఇతర సంస్థల కూటమి కూడా విధించిన వీసా రుసుములకు వ్యతిరేకంగా మొదటి ప్రధాన దావా వేసింది. దీనిని ఏకపక్షంగా, మోసపూరితంగా భావిస్తూ.. H-1B వీసా విధానాన్ని కోర్టులో సమర్థించుకోవడానికి ట్రంప్ అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.