Share News

Train Hijack: ఆర్మీ ఆపరేషన్‌ అపకుంటే అందర్నీ చంపేస్తాం.. బీఎల్‌ఏ హెచ్చరిక

ABN , Publish Date - Mar 12 , 2025 | 08:59 PM

సైన్యం కిడ్నాప్ చేసిన రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులు, అదృశ్యమైన వ్యక్తులను విడిచిపెట్టాలని తాము చేసిన డిమాండ్‌ను పాకిస్థాన్ తోసిపుచ్చడంపై బీఎల్ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిలటరీ చర్యలు తక్షణం ఆపాలని, లేకుంటే తమ వద్ద బందీలుగా ఉన్న 150 మందిని హతమారుస్తామని హెచ్చరించింది.

Train Hijack: ఆర్మీ ఆపరేషన్‌ అపకుంటే అందర్నీ చంపేస్తాం.. బీఎల్‌ఏ హెచ్చరిక

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రైలు హైజాక్ చేసి పలువురు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న బలోచ్ వేర్పాటువాదులపై ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 30 మంది మిలిటెంట్లను సైన్యం మట్టుబెట్టి, 190 మంది బందీలను విడిపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తాజా ప్రెస్‌నోట్ విడుదల చేసింది. బలోచిస్థాన్‌లో ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతుండటంతో మరో 50 మంది బందీలను హతమార్చినట్టు ప్రకటించింది.

PM Modi: మారిషస్‌లో కొత్త పార్లమెంటు నిర్మాణానికి భారత్ చేయూత: మోదీ


సైన్యం కిడ్నాప్ చేసిన రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులు, అదృశ్యమైన వ్యక్తులను విడిచిపెట్టాలని తాము చేసిన డిమాండ్‌ను పాకిస్థాన్ తోసిపుచ్చడంపై బీఎల్ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిలటరీ చర్యలు తక్షణం ఆపాలని, లేకుంటే తమ వద్ద బందీలుగా ఉన్న తక్కిన 150 మందిని హతమారుస్తామని హెచ్చరించింది. ఖైదీల మార్పిడికి పాకిస్థాన్ ప్రభుత్వం 20 గంటల్లోగా చర్యలు తీసుకోవాలంటూ అల్టిమెంట్ ఇచ్చింది.


పాకిస్థాన్ ఇంతకుముందు డ్రోన్ దాడి జరపడంతో తాము 10 మంది బందీలను హతమార్చినట్టు కూడా ప్రెస్‌నోట్‌లో బీఎల్ఏ పేర్కొంది. ఇటీవల ఘర్షణల్లో 100 మందికి పైగా పాక్ జవాన్లను హతమార్చామని, ఒక్క మంగళవారంనాడు జరిగిన ప్రతిఘటనలోనే 30 మందిని హతమార్చామని ప్రకటించుకుంది. లిబరేషన్ పోరాటంలో భాగంగానే తాము పోరాడుతున్నామని, తమకు సరైన న్యాయం జరిగేంతవరకూ పోరాడం ఆపేది లేదని ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

Trump: కెనడాపై సుంకాలు డబుల్‌

Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..

USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ

Read Latest and International News

Updated Date - Mar 12 , 2025 | 09:10 PM