Share News

USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:57 PM

పాక్ దౌత్య వేత్తకు అమెరికాలో చుక్కెదురైంది. వ్యక్తిగత పర్యటనకు వచ్చిన ఆయనకు ఇమిగ్రేషన్ అధికారులు అమెరికాలోకి అనుమతి నిరాకరించడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇది పాక్ ప్రభుత్వానికి తలవంపులుగా మారింది.

USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌కు (Pakistan) అమెరికా గట్టి షాకిచ్చింది. వీసా ఉన్నప్పటికీ పాక్ సీనియర్ దౌత్యవేత్తకు ఎయిర్ పోర్టు అధికారులు అమెరికాలోకి అనుమతిని నిరాకరించారు. దీంతో, పాక్ రాజకీయ వర్గాల్లో ఈ ఉదంతం కలకలానికి దారి తీసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, సీనియర్ దౌత్యవేత్త కేకే వగన్ ప్రస్తుతం తుర్కమెనిస్థాన్‌లో పాక్ రాయబారిగా ఉన్నారు. ఇటీవల ఆయన విమానంలో వ్యక్తిగత పర్యటనపై అమెరికాకు వెళ్లారు. ఆయన వద్ద అమెరికా వీసాతో పాటు ఇతర అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా కానీ అమెరికా వలసల శాఖ అధికారులు అమెరికాలోకి అనుమతించలేదు. ఎయిర్ పోర్టు నుంచే తిరిగి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. దౌత్య సిబ్బంది ప్రొటోకాల్‌కు సంబంధించి ఎయిర్‌పోర్టు అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయనను వచ్చి చోటుకే వెళ్లిపోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. అధికారుల అభ్యంతరాలు ఏమిటనేది మాత్రం తెలియరాలేదు.


PM Modi: మారిషస్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. రెండు రోజులు కూడా..

ఈ ఘటనకు సంబంధించి పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందిందని స్థానిక మీడియా తెలిపింది. ఘటనపై వివరణ ఇవ్వాలని వగన్‌ను పాక్‌కు పిలిపించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, వగన్ ఓ ప్రైవేటు విమానంలో అమెరికా వెళ్లినట్టు పాక్ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు కూడా చెప్పాయి. ఈ ఘటన మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడంతో పాక్ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టినట్టైంది.


Helicopter Crash: కుప్పకూలిన మరో హెలికాప్టర్.. ముగ్గురు మృతి

పాక్, అప్ఘాన్ పర్యాటకులు అమెరికాకు రాకుండా నిషేధం విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇది పాక్‌‌లో కలకలానికి దారి తీసింది. భద్రతాపరమైన కారణాలు, తనిఖీల్లో రిస్కులతో ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే వారమే ఈ నిషేధాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ట్రంప్ తన తొలి పర్యాయంలో ముస్లింలు అధికంగా ఉన్న ఏడు దేశాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్య వేత్త ఉదంతం పాక్‌ను కలవర పెడుతోంది.


Lalit Modi: లలిత్ మోదీపై సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ

Read Latest and International News

Updated Date - Mar 11 , 2025 | 06:31 PM