Share News

Helicopter Crash: కుప్పకూలిన మరో హెలికాప్టర్.. ముగ్గురు మృతి

ABN , Publish Date - Mar 11 , 2025 | 08:57 AM

ఓ అత్యవసర వైద్య సేవల హెలికాప్టర్ అనుకోకుండా కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కూడా మరణించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎంటనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Helicopter Crash: కుప్పకూలిన మరో హెలికాప్టర్.. ముగ్గురు మృతి
Helicopter Crash

ఇటివల కాలంలో ప్రపంచవ్యాప్తంగా హెలికాప్టర్, విమాన ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మెడికల్ హెలికాప్టర్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో అందులోని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం అమెరికా మిస్సిసిప్పిలో నాట్చెజ్ ట్రేస్ పార్క్‌వేకు దక్షిణంగా పైప్‌లైన్ రోడ్‌కి ఉత్తరంగా ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన మార్చి 10, 2025న సోమవారం జరిగింది.


ఈ ఘటనపై

హెలికాప్టర్ ప్రమాద సమయంలో అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారని మాడిసన్ షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి హీత్ హాల్ చెప్పారు. ఇద్దరు UMMC (మిస్సిసిపి విశ్వవిద్యాలయ వైద్య కేంద్రం) ఉద్యోగులు కాగా, ఒక పైలట్ ఉన్నట్లు వెల్లడించారు. అయితే ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో రోగులు ఎవరూ లేరని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో అది ప్రసవించిన ఓ రోగిని తీసుకుని వెళ్లి, తిరిగి వస్తున్న క్రమంలో కుప్పకూలింది. ఈ ఘటన నేపథ్యంలో UMMC అధికారులు హెలికాప్టర్‌లో ఉన్న వారిని గుర్తించారు. కానీ వారి పేరు సహా ఇతర వివరాలను వెల్లడించలేదు.


ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు తక్షణ సమాచారం అందించి, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు అధికారులు. దీంతోపాటు UMMC ఆఫీసియల్స్ బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేపట్టాయని అధికారికంగా ప్రకటించారు.


మిస్సిసిపి గవర్నర్ టేట్ రీవ్స్ కూడా ఈ ప్రమాదంపై స్పందించి, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదం వల్ల దేశవ్యాప్తంగా హెలికాప్టర్ సేవలపై కొంత అనిశ్చితి ఏర్పడింది. ముఖ్యంగా మెడికల్ హెలికాప్టర్లు, ఇవి అత్యవసర రోగులను లేదా ప్యాసింజర్లను తరలించే ప్రక్రియలో పాల్గొంటాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో వీటి ప్రయాణ సమయంలో పునః పరిశీలన, మౌలికమైన భద్రతా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమనే విషయాలు మళ్ళీ చర్చకు వస్తున్నాయి. దీనికి ముందు కూడా అనేక చోట్ల ఫ్లైట్స్, హెలికాప్టర్లు సైతం కూలిన సందర్భాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

Elon Musk: సోషల్ మీడియా Xలో అంతరాయం.. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిందన్న ఎలాన్ మస్క్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 11 , 2025 | 08:58 AM