Share News

Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..

ABN , Publish Date - Mar 12 , 2025 | 09:20 AM

గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. ఉక్రెయిన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీలో చర్చల తర్వాత అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకారం తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..
Ukraine Agrees

సౌదీ అరేబియాలో జరిగిన చర్చల అనంతరం, ఉక్రెయిన్(Ukraine) 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించింది. రష్యాతో జరిగే యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సిద్ధమైందని కైవ్ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలో కాల్పుల విరమణపై సుమారు నెల రోజుల విరామం ఉండాలని నిర్ణయించారు. అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శాంతి కోసం అన్నీ ఆగిపోవాలని అమెరికా భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ అన్నారు.


యుద్ధ విరమణ కాకుండా

అంతేకాకుండా సౌదీ అరేబియాలో జరిగిన చర్చలకు నాయకత్వం వహించిన విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఈ ప్రతిపాదనను రష్యాకు అందజేస్తామన్నారు. క్రెమ్లిన్‌కు ఆంగీకారం లేకుండా ఈ ప్రతిపాదనను పూర్తి చేయడం వీలు కాదని, ఇది తాత్కాలిక యుద్ధ విరమణ కాకుండా, శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చలు దాదాపు ఎనిమిది గంటలపాటు సాగినప్పుడు, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక భద్రతా హామీలపై సమగ్ర చర్చలు జరిగాయి. ఇందులో అమెరికా సైనిక సహాయం, నిఘా భాగస్వామ్యం తిరిగి ప్రారంభమవుతుందని కూడా వెల్లడించారు.


శాంతి ఒప్పందానికి ఆశలు

మనం ఈ యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్‌తో కలిసి పని చేయాలని ఆశిస్తున్నామని చర్చల అనంతరం ట్రంప్ అన్నారు. ఇది చాలా ముఖ్యమని, ఎందుకంటే మనం ఈ భయంకరమైన యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు చెప్పారు. మేము గమనించినట్లు, శత్రువులూ, స్నేహితులూ ఉక్రెయిన్‌లో చంపబడ్డారని, ఈ పరిస్థితిని మార్చాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌లో ఆక్రమణ కొనసాగిస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఒక కీలక దశగా భావిస్తున్నారు.


కాల్పుల విరమణకు ఉక్రెయిన్ మద్దతు

ఈ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్, 30 రోజుల కాల్పుల విరమణపై రష్యాతో చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. సౌదీ అరేబియాలో జరిగిన చర్చలకు, జెలెన్స్కీ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపి మేము ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. జెలెన్స్కీ తన ప్రసంగంలో ఈ ప్రతిపాదన రష్యాను ఒప్పించడమే తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

అమెరికా అంగీకరించమని రష్యాను ఒప్పించాలని, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోందన్నారు. కానీ అది రష్యా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనల ద్వారా అమెరికా, ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. 30 రోజుల కాల్పుల విరమణతో నమ్మకం పెంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. ఈ చర్చల అనంతరం దశలవారీగా శాంతి ఒప్పందం ఏర్పడేందుకు మార్గాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 12 , 2025 | 09:24 AM