Thai Court Sacks PM Shinawatra: థాయ్‌లాండ్ ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:47 PM
థాయ్ లాండ్ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో పార్లమెంటు కొత్త ప్రధానిని ఎన్నుకునేంత వరకూ ఉప ప్రధాని ఫుటం వెచయ్చే, ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు ఆపద్ధర్మ బాధ్యతలు చేపడతారు. ప్రధాని ఎన్నిక తేదీని సభాపతి (స్పీకర్) నిర్ణయిస్తారు.
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధానమంత్రి (Thailand PM) పేటోంగ్‌టార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)ను దేశ రాజ్యాంగ ధర్మాసనం పదవి నుంచి తొలగించింది. నైతిక ఉల్లంఘనల కారణంగా ఆమెను న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. కంబోడియా మాజీ నేత ఫోన్ కాల్ లీక్‌తో ఆమె నైతిక నింబధనలను ఉల్లంఘించారని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం కింద ప్రధానికి తగిన అర్హతలు లేవని కోర్టు పేర్కొంది. తాజా తీర్పుతో పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఆమె పదవీచ్యుతులయ్యారు. గతేడాది ఆగస్టు 18న షినవత్రా ప్రధానమంత్రి అయ్యారు.
కాగా, అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో పార్లమెంటు కొత్త ప్రధానిని ఎన్నుకునేంత వరకూ ఉప ప్రధాని ఫుటం వెచయ్చే, ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు ఆపద్ధర్మ బాధ్యతలు చేపడతారు. ప్రధాని ఎన్నిక తేదీని సభాపతి (స్పీకర్) నిర్ణయిస్తారు.
కొత్త ప్రధాని రేసులో...
కాగా, థాయ్‌లాండ్ కొత్త ప్రధాని పదవికి అర్హత కలిగిన నేతలు ఐదుగురు ఉన్నారు. మాజీ న్యాయశాఖ మంత్రి, అటార్నీ జనరల్ చైకాసేం నీతిసిరి (77), మాజీ దేశీయాంగ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ (58), ఇంధన శాఖ మంత్రి పిరపాన్ సలిరాథావిభాగ, మాజీ ఉపప్రధాని జురిన్ లక్సానావిసిట్, మాజీ ప్రధాని ప్రయుత్ చాన్-ఓచాలు ప్రధాని రేసులో ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థికి 50 మంది ఎండార్స్‌మెంట్ ఉండాలి. సభలో 493 మంది సభ్యులు ఉండగా.. గెలుపునకు 247 ఓట్లు అవసరమవుతాయి. అభ్యర్థికి తగిన ఓట్లు రాకుంటే సభ మరోసారి సమావేశమవుతుంది. నామినేట్ అయిన మరో అభ్యర్థి కూడా ఇదే తరహాలో ఓట్లు సాధించుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఎన్నికయ్యేంత వరకూ ఈ తరహా ప్రక్రియ కొనసాగిస్తారు. దీనికి పరిమితి అనేది లేదు.
ఇవి కూడా చదవండి..
రష్యా డ్రోన్ దాడి.. భారీ ఉక్రెయిన్ యుద్ధ నౌక ధ్వంసం.. వీడియో వైరల్
భారత్‌పై అమెరికా సుంకాలు.. ఏనుగుపై ఎలుక దాడి లాంటివే: అమెరికా ఆర్థికవేత్త
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి