Share News

Texas man arrested: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్..

ABN , Publish Date - Oct 07 , 2025 | 10:37 AM

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్‌ను కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన 27 ఏళ్ల చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లాడు.

Texas man arrested: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్..
Indian student shot dead

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్‌ను కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన 27 ఏళ్ల చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లాడు. ఆరు నెలల క్రితం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం అన్వేషణ సాగిస్తూ ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ చేస్తున్నాడు (Indian student shot dead).


గురువారం రాత్రి చంద్రశేఖర్ డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ గాయాల కారణంగా చంద్రశేఖర్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. రిచ్‌ల్యాండ్‌కు చెందిన రిచర్డ్ ఫ్లోరెజ్ అనే వ్యక్తి చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ తర్వాత మరొక వాహనంపై కూడా కాల్పులు జరిపాడు. అయితే అక్కడ ఎవరికీ గాయాలు కాలేదు. అక్కడి నుంచి మెరైన్ డ్రైవ్‌లోకి వెళ్లి ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడు (Indian student killed in US).


చివరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు (Texas man arrested). అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడిపై హత్య కేసు బుక్ చేసినట్టు పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 07 , 2025 | 10:37 AM