Share News

America: మరో ఘోర విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..

ABN , Publish Date - Feb 01 , 2025 | 07:18 AM

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఫిలడెల్ఫియాలో ప్రమాదవశాత్తూ విమానం కూలిపోయింది.

America: మరో ఘోర విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..
US plane crash

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియాలో ప్రమాదవశాత్తూ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. శుక్రవారం సాయంత్రం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాలో జనావాసాలపైకి దూసుకెళ్లింది. దీంతో భారీ పేలుడుతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇళ్లు, వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.


ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) ప్రకారం.. లియర్‌జెట్ 55 అనే చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 06:30 గంటలకు బయలుదేరింది. నాలుగు మైళ్లు(6.4 కి.మీ.) ప్రయాణించే లోపే మిస్సౌరీలోని స్ప్రింగ్‌ఫీల్డ్-బ్రాన్సన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో కూలిపోయింది. వాతావరణం పరిస్థితుల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(NTSB) దర్యాప్తు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, జనవరి 31న వాషింగ్టన్ సమీపంలో ఆర్మీ హెలికాఫ్టర్, ఓ విమానం ఢీకొని 64 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

Donald Trump: జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమే ప్రపంచమంతా అమెరికాలో తిష్ట వేసేందుకు కాదు: ట్రంప్‌

Plane Crash: విమానం, ఆర్మీ హెలికాప్టర్‌ ఢీ

Updated Date - Feb 01 , 2025 | 07:42 AM