Share News

Donald Trump: జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమే ప్రపంచమంతా అమెరికాలో తిష్ట వేసేందుకు కాదు: ట్రంప్‌

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:44 AM

ఈ హక్కు కేవలం బానిసల పిల్లల కోసం కల్పించినదని, అంతే తప్ప.. ప్రపంచం మొత్తం వచ్చి అమెరికాలో తిష్ట వేసేందుకు కాదని అన్నారు. అధికారంలోకి వచ్చీరాగానే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేయడం, ఇది వివాదాస్పదం కావడంతో న్యాయస్థానం ఆ ఉత్తర్వులను నిలిపివేయడం తెలిసిందే.

Donald Trump: జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమే ప్రపంచమంతా అమెరికాలో తిష్ట వేసేందుకు కాదు: ట్రంప్‌

వాషింగ్టన్‌, జనవరి 31: జన్మతః పౌరసత్వం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హక్కు కేవలం బానిసల పిల్లల కోసం కల్పించినదని, అంతే తప్ప.. ప్రపంచం మొత్తం వచ్చి అమెరికాలో తిష్ట వేసేందుకు కాదని అన్నారు. అధికారంలోకి వచ్చీరాగానే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేయడం, ఇది వివాదాస్పదం కావడంతో న్యాయస్థానం ఆ ఉత్తర్వులను నిలిపివేయడం తెలిసిందే. కాగా, ఈ అంశంపై ట్రంప్‌ తాజాగా స్పందిస్తూ, ‘‘గతాన్ని ఓసారి పరిశీలిస్తే జన్మతః పౌరసత్వ హక్కును బానిసల పిల్లల కోసం కల్పించిందనే విషయం స్పష్టమవుతుంది. అంతే తప్ప.. ప్రపంచం మొత్తం వచ్చి అమెరికాను ఆక్రమించుకునేందుకు కాదు. అర్హత లేనివారు కూడా ఇక్కడికి వస్తున్నారు. తద్వారా అర్హత లేని పిల్లలకు పౌరసత్వం దక్కుతోంది’’ అని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:44 AM