US Immigration Shooting: అమెరికా ఇమిగ్రేషన్ ఆఫీస్ వద్ద కాల్పులు..ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:58 AM
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. డల్లాస్ నగరంలోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయం వద్ద ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. డల్లాస్‌లోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఫీల్డ్ ఆఫీస్ వద్ద జరిగిన కాల్పుల (US Immigration Shooting) ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను లక్ష్యిత హింసాత్మక చర్యగా పేర్కొన్న ఎఫ్‌బీఐ, దర్యాప్తు చేస్తోంది. దాడి చేసిన వ్యక్తి జోషువా జాన్‌గా గుర్తించబడ్డాడు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం, ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఒక డిటైనీ, అంటే ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి. గాయపడిన ఇద్దరిలో ఒకరు మెక్సికన్ జాతీయుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన ఇద్దరూ ప్రస్తుతం క్రిటికల్ కండిషన్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన జోషువా జాన్ గాయం వల్ల మరణించాడని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఘటనా స్థలంలో దొరికిన బుల్లెట్ కేసింగ్‌లపై ఐసీఈ వ్యతిరేక సందేశాలు ఉన్నాయని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. ఈ సందేశాలు దాడి ఉద్దేశంపై మరింత సమాచారం ఇస్తున్నాయని, వాటి గురించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఈ హింసకు రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్స్ కారణమని ఆరోపించారు. డల్లాస్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటన ఇమిగ్రేషన్ సంబంధిత సమస్యలపై అమెరికాలో ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత పెంచాలనే చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి