First Female Prime Minister: జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకైచి
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:41 AM
జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా అధికార పార్టీ ఎల్‌డీపీ నేత సనే తకైచి ఎన్నికయ్యారు. మంగళవారం పార్లమెంట్ దిగువసభలో.....
టోక్యో, అక్టోబరు 21: జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా అధికార పార్టీ ఎల్‌డీపీ నేత సనే తకైచి ఎన్నికయ్యారు. మంగళవారం పార్లమెంట్ దిగువసభలో జరిగిన ఓటింగ్‌లో ఆమె చారిత్రక విజయం సాధించారు. 465 మంది సభ్యులు గల సభలో తకైచి మెజార్టీ మార్కును దాటి 237 ఓట్లు సాధించారు. తకైచి ఎన్నికను ఎగువసభ కూడా ఆమోదించనుంది. తర్వాత జపాన్ రాజుతో సమావేశమైన అనంతరం.. ఆమె దేశ 104వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి వరకు ప్రధానిగా కొనసాగిన షిగెరు ఇషిబా పలు ఎన్నికల్లో భారీ ఓటముల నేపథ్యంలో గతనెల తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. రాజకీయాల్లో మహిళా ప్రాతినిథ్యంలో అట్టడుగు స్థానంలో ఉన్న దేశానికి 64 ఏళ్ల సానే తకైచి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నిక కావడం ఒక చారిత్రక విజయంగా చెప్పవచ్చు. తకైచి దేశ తొలి ఆర్థిక మహిళా మంత్రిగా సత్సుకి కటమయాను నియమించుకొనే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. తకైచి జపాన్‌లో బౌద్ధమతం విరాజిల్లిన పురాతన నగరమైన నరాలో 1961 మార్చి 3న జన్మించారు. ఆమె తండ్రి ఒక కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా, తల్లి నరా పోలీస్ విభాగంలో పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.