Donald Trump: ఎర్రటి ఎలక్ట్రిక్ కారు తీసుకున్న దేశాధినేత.. ఎందుకో తెలుసా..
ABN , Publish Date - Mar 12 , 2025 | 10:26 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా నుంచి అందమైన ఎర్రటి కారును కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్‌కు మద్దతుగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా కంపెనీ ఎర్రటి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ క్రమంలో ట్రంప్ కోసం నాలుగైదు కార్లను వైట్ హౌస్‌కు తీసుకొచ్చారు. అందులో సైబర్ ట్రక్ కూడా ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ వాటిలో ఎర్రటి కారు ఎంచుకున్నారు. కారు బాగుందని, 80 వేల డాలర్లకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత మస్క్‌ను దేశభక్తుడిగా అభివర్ణించారు ట్రంప్.
టెస్లా షేర్లు
అయితే ఇటీవల ఎలాన్ మస్క్ ప్రభుత్వ వ్యయంలో భారీగా కోతలు విధించడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం వంటి చర్యల కారణంగా అనేక విమర్శలకు గురయ్యాయి. ఈ విధంగా ఆయన చర్యలు చాలా మందిలో వ్యతిరేకతకు దారితీశాయి. దీంతో టెస్లా షేర్లు చాలా రోజులపాటు క్షీణించగా, మస్క్ పెద్ద ఎత్తున నష్టాన్ని చవిచూశారు. ఈ క్రమంలోనే టెస్లా, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ తన మద్దతును ప్రకటించారు. మస్క్, ఆయన కంపెనీ ప్రస్తుతం బహిరంగ విమర్శలకు గురవుతున్నా, ట్రంప్ మస్క్ కి సానుకూలంగా ఉండడం, ఆయనే తన దృక్పథాన్ని ప్రజల ముందు ఉండటంతో కొంతమంది ఆశాజనకంగా మారుతారని తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ మద్దతు
అమెరికాలో టెస్లా కార్లపై జరుగుతున్న విమర్శలు, నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చాయి. టెస్లా కార్లు, వాటి షోరూమ్స్‌ను లక్ష్యంగా చేసుకునే ఘటనలు పెరిగాయి. కొన్ని ప్రాంతాలలో టెస్లా కార్లపై దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలోన్ మస్క్ కు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన దేశభక్తుడని, ఆయనను శిక్షించడం అన్యాయమని వెల్లడించారు.
దీనికి ముందు మస్క్
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎలాన్ మస్క్ బహిరంగంగానే డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇచ్చారు. దీనికి ముందు ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంతో బాధపడుతుండగా, ఎలాన్ మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చేందుకు వెనుకడుగు వేయలేదు. మస్క్ ముఖ్యంగా ట్రంప్ ఆర్థిక విధానాలు, వ్యాపారం సహా "అమెరికా ఫస్ట్" వంటి విధానాలకు సపోర్ట్ చేశారు.
అలాగే ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడాన్ని పబ్లిక్‌గా ప్రకటించలేదు. కానీ తన సోషల్ మీడియాతోపాటు ట్రంప్ ప్రణాళికలను అంగీకరించారు. దీంతో ఎలాన్ మస్క్ , డొనాల్డ్ ట్రంప్ మధ్య అనేక వివాదాస్పద క్షణాలు ఉన్నా, వాణిజ్య, ఆర్థిక దృష్టికోణం విషయంలో మాత్రం వారి బంధం దృఢంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మస్క్ ఎప్పటికప్పుడు తాను అమెరికా ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమల విస్తరణను మార్చనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ట్రంప్ కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి:
Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News