US Mass Shooting: అమెరికాలో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి..
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:19 PM
అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ ఫిలడెల్ఫియా గ్రేస్ ఫెర్రీ ప్రాంతంలో తెల్లవారుజామున సామూహిక కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ భయంకర దాడిలో ముగ్గురు మరణించగా.. 10 మంది గాయపడ్డారు.
Philadelphias Mass Shooting 2025: అమెరికా(America)లో మరోమారు తూపాకీల మోత మోగింది. దక్షిణ ఫిలడెల్ఫియా గ్రేస్ ఫెర్రీ ప్రాంతంలో తెల్లవారుజామున సామూహిక కాల్పులు (Firing) చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘోరమైన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, కనీసం పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. రింగ్ నిఘా కెమెరాలో రికార్డయిన ఆ వీడియోలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కొంతమంది దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌత్ ఎట్టింగ్ స్ట్రీట్‌లోని 1500 బ్లాక్‌లో తెల్లవారుజామున 1 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ముందు గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీలతో వచ్చి వీధుల్లో పలురౌండ్లు కాల్పులు జరిపారు. సెకన్ల వ్యవధిలో జరిగిన దాడిలో కొంతమంది ప్రజలు భయంతో చెల్లాచెదురుగా పారిపోతున్న దృశ్యాలు రింగ్ కెమెరాలో రికార్డయ్యాయి. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ ఫుటేజ్ లో కాల్పులు చెలరేగిన సమయంలో నెలకొన్న గందరగోళ దృశ్యాలు భయానికి గురిచేస్తాయి. ఇక, బాధితులంతా 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సువారేనని తెలుస్తోంది.
ఈ ఘోరదాడిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తప్పించుకునే ప్రయత్నంలో ఓ దుండగుడు గాయపడగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూాడా చదవండి..
14 దేశాలకు ట్రంప్ లేఖలు.. సుంకాలు తప్పవంటూ వార్నింగ్
అస్థికలతో అంతరిక్ష ప్రయాణం.. తిరిగొస్తుండగా..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి