Share News

Pakistan warning: అదే జరిగితే భారత్, పాక్ రెండూ కనమరుగవుతాయి: పాకిస్థాన్ ఆర్మీ వార్నింగ్

ABN , Publish Date - Oct 05 , 2025 | 06:57 AM

ఇటీవలి కాలంలో భారత రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో మరోసారి యుద్ధం జరిగితే అది పెను విధ్వంసానికి కారణం కావొచ్చని హెచ్చరించింది.

Pakistan warning: అదే జరిగితే భారత్, పాక్ రెండూ కనమరుగవుతాయి: పాకిస్థాన్ ఆర్మీ వార్నింగ్
Pakistan conflict warning

ఇటీవలి కాలంలో భారత రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో మరోసారి యుద్ధం జరిగితే అది పెను విధ్వంసానికి కారణం కావొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ మీద మరోసారి దాడి చేసేందుకు భారత్ సాకులు సృష్టించుకుంటోందని పాక్ ఆర్మీ ఆ ప్రకటనలో ఆరోపించింది (Pakistan India tensions).


పాకిస్థాన్ ఆర్మీని ప్రపంచ పటం నుంచి తుడిచేస్తామని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం హెచ్చరించారు. అలాగే తమ పౌరులను రక్షించుకోవడానికి అవసరమైతే సరిహద్దులను దాటి కూడా యుద్ధం చేస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల హెచ్చరించారు. ఈ ప్రకటనలపై శనివారం పాక్ ఆర్మీ స్పందించింది. పాక్‌ను ప్రపంచ పటం నుంచి తప్పిస్తామనే హెచ్చరికపై స్పందిస్తూ.. అలాంటి పరిస్థితి వస్తే రెండు దేశాలూ కనమరుగవుతాయని హెచ్చరించింది (Nuclear warning).


'మరోసారి యుద్ధం చెలరేగితే.. పాకిస్థాన్ వెనక్కి తగ్గదు (future war threat). వేగంగా, విధ్వసకరంగా, గట్టిగా బదులిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు' అని పాక్ ఆర్మీ పేర్కొంది. భారత దేశ అత్యున్నత్త భద్రతా యంత్రాంగం నుంచి వస్తున్న యుద్ధోన్మాద, కవ్వింపు ప్రకటనలు ఆందోళనకరమని, అవి దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పాక్ ఆర్మీ పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

హమాస్‌ శాంతి ఒప్పందానికి సిద్ధమన్న ట్రంప్.. ఇంతలో మళ్లీ ఇజ్రాయెల్ దాడులు

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2025 | 06:57 AM