Asim Munir Threatens Attack on Jamnagar Refinery: భారత్‌తో యుద్ధం జరిగితే..ముఖేశ్ అంబానీ రిఫైనరీపై దాడి
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:29 AM
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తన అమెరికా పర్యటన సందర్భంగా భారత్‌పై ఎడాపెడా నోరుపారేసుకుంటున్నారు. ..
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హెచ్చరికలు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 12: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తన అమెరికా పర్యటన సందర్భంగా భారత్‌పై ఎడాపెడా నోరుపారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న అణుబాంబు వేస్తామని, తమ ఉనికికి ప్రమాదం ఏర్పడితే.. తాము మునగడమే కాకుండా.. సగం ప్రపంచాన్ని వెంట తీసుకెళ్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే..! అమెరికాలోని టంపా, ఫ్లోరిడాల్లో జరిగిన కార్యక్రమాల్లో మునీర్ ఈ వ్యాఖ్యలు చేయగా.. అదే సందర్భంలో ముఖేశ్ అంబానీకి చెందిన జామ్‌నగర్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగారు. భారత్‌తో యుద్ధం జరిగితే.. జామ్‌నగర్ రిఫైనరీపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ముఖేశ్ అంబానీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మునీర్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అణు బ్లాక్‌మెయిల్‌కు భారత్ ఎన్నటికీ లొంగదని, జాతీయ భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. కాగా.. మునీర్ వ్యాఖ్యల తర్వాత.. సింధు సహా.. ఆరు నదులపై పాకిస్థాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మరో యుద్ధం జరిగితే.. పాకిస్థాన్ ఆరు నదుల(సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్)ను తిరిగి తీసుకుంటుందని హెచ్చరించారు.
నీళ్లివ్వాలంటూ విజ్ఞప్తులు
ఓ వైపు ఆసిమ్ మునీర్, బిలావల్ భుట్టో భారత్‌పై బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తుంటే.. ఆ దేశ విదేశాంగ శాఖ మాత్రం నీళ్ల కోసం భారత్‌కు విజ్ఞప్తులు చేస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని.. చీనాబ్, జీలం, సింధు నదుల జలాల విషయంలో ఆర్బిట్రేషన్ తీర్పును అనుసరించి, నీళ్లివ్వాలని కోరింది. అయితే.. ఈ తీర్పును భారత్ ఎప్పటినుంచో తిరస్కరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే..!
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News