Share News

Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - May 05 , 2025 | 09:07 PM

రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో అసీం మునీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రాంతీయ శాంతినే కోరుకుంటోందని, అయితే తనను తాను రక్షించుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడదని అన్నారు.

Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఉచ్చు తమచుట్టూ బిగుస్తోందని, భారత్ నుంచి ప్రతీకార దాడి తప్పదని లోలోపల పాక్ బెంబేలెత్తుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ (Asim Munir) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తలెత్తినట్లయితే పాకిస్థాన్ పూర్తి సైనిక సత్తా చాటుతుందని వ్యాఖ్యానించారు.

Pakistan: తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి.. అసెంబ్లీలో పాక్ విపక్ష నేత చిందులు


రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో అసీం మునీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రాంతీయ శాంతినే కోరుకుంటోందని, అయితే తనను తాను రక్షించుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడదని అన్నారు. జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సమగ్రత కాపాడుకునేందుకు సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు.


బలూచిస్థాన్‌లోనే అంతర్గత భద్రత, అభివృద్ధి సవాళ్లు ఉన్నాయని తన ప్రసంగంలో ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. అక్కడ తిరుగుబాట్లు, విదేశీ ఉగ్రవాదంతో పాక్‌స్థాన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందన్నారు. బలూచ్ ఐడింటెటీ పేరుతో స్వార్ధ ప్రయోజనాలతో ఉగ్రవాద సంస్థలు టెర్రర్ సృష్టించే ప్రయత్నాలు సాగిస్తున్నాయన్నారు. పాకిస్థాన్ ప్రజల పూర్తి సహకారంతో ఉగ్రవాద నిర్మూలనకు సాయుధ బలగాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల పోరాటం కొనసాగుతుందన్నారు.


ఇవి కూడా చదవండి..

Pak Missile Test: రెండోసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన పాక్

India Pak War: యుద్ధం వస్తే పారిపోతానన్న పాక్ ఎంపీ

Smallest War: వార్ ఒన్ సైడ్ అంటే ఇదే.. ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధమిదే..

Updated Date - May 05 , 2025 | 10:14 PM