India Pak War: యుద్ధం వస్తే పారిపోతానన్న పాక్ ఎంపీ
ABN , Publish Date - May 04 , 2025 | 06:52 PM
ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కు లీగల్ అడ్వయిజర్‌గా, పార్టీ ప్రతినిధిగా కూడా అఫ్జల్ ఖాన్ ఉన్నారు. యుద్ధం అంటూ మొదలైతే ఆయుధం పట్టి కదనరంగంలోకి వెళ్తారా అని ఒక పాత్రికేయుడు అఫ్జల్ ఖాన్‌ను ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ యుద్ధానికి దిగవచ్చనే భయాందోళన పాక్ ప్రజల్లో ముఖ్యంగా అక్కడి రాజకీయ నేతల్లో కనిపిస్తోంది. పాలక పక్ష నేతలు మాత్రం భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దురాక్రమణకు దిగితే 'అణు' ముప్పు తప్పదని, పూర్తి స్థాయి యుద్ధానికి వెనుకాడమని చెబుతున్నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే యుద్ధ భీతితో పలువురు సైనికి సిబ్బంది రాజీనామాలతో తిరుగుటపా కడుతుంటే, నాలుగు రోజులకు సరిపడే మందుగుండు సామాగ్రి మాత్రమే పాక్ వద్ద ఉందని, తీవ్రమైన మందుగుండు కొరత ఉందనే ప్రచారమూ బలంగా జరుగుతోంది. వీటిని బలపరచే విధంగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మరవత్ (Sher Afzal Khan Marwat) తన ''ఎగ్జిట్ ప్లాన్'' చెప్పి ఆశ్చర్యపరిచారు.
Pakistans Artillery Shortage: ఆర్టిలరీ అమ్యూనిషన్ కొరత.. 4 రోజులకు మించి యుద్ధం చేయలేని స్థితిలో పాక్

ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కు లీగల్ అడ్వయిజర్‌గా, పార్టీ ప్రతినిధిగా కూడా అఫ్జల్ ఖాన్ ఉన్నారు. యుద్ధం అంటూ మొదలైతే ఆయుధం పట్టి కదనరంగంలోకి వెళ్తారా అని ఒక పాత్రికేయుడు అఫ్జల్ ఖాన్‌ను ప్రశ్నించినప్పుడు, యుద్ధం అంటూ వస్తే నేను ఇంగ్లాడ్‌కు వెళ్లిపోతానంటూ ఆయన సమాధానమిచ్చారు.
మంత్రులు కూడా విమానాలు బుక్ చేసుకున్నారు..
కాగా, యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతానంటూ పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. పాక్ ఆర్మీని ప్రజలు కానీ, నాయకులు కానీ విశ్వసించడం లేదని, ముఖ్యంగా భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పాక్ ఆర్మీని విశ్వసించే వారే అక్కడ కరవయ్యారని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ బండారీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పాకిస్థాన్ మంత్రులు ఇప్పటికే తమ కుటుంబ సభ్యులతో ఇంగ్లాండ్ తదితర దేశాలకు వెళ్లిపోయేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారని తెలిపారు.
''భారతదేశ రక్షణ సామర్థ్యంతో తలపడలేమనే విషయంలో పాక్‌లో ఏకాభిప్రాయం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్థాన్‌కు భారత్ గట్టి జవాబివ్వనుందనే అభిప్రాయం పాక్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల్లోనూ ఉంది'' అని ప్రదీప్ బండారీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..