Share News

Pakistan: తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి.. అసెంబ్లీలో పాక్ విపక్ష నేత చిందులు

ABN , Publish Date - May 05 , 2025 | 08:18 PM

పహల్గాం ఉగ్రదాడిపై పాక్ జాతీయ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్ష నేత, పీటీఐ మద్దతుతో గెలిచిన ఎంపీ ఒమర్ అయూబ్ భారత్‌పై విషం కక్కారు. యుద్ధోన్మాదంతో ఊగిపోతూ వ్యాఖ్యలు చేశారు.

Pakistan: తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి.. అసెంబ్లీలో పాక్ విపక్ష నేత చిందులు

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడిపై పాక్ జాతీయ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్ష నేత, పీటీఐ మద్దతుతో గెలిచిన ఎంపీ ఒమర్ అయూబ్ (Omar Ayub) భారత్‌పై విషం కక్కారు. యుద్ధోన్మాదంతో ఊగిపోతూ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు న్యూఢిల్లీకి దాసోహం అన్నట్టుగా ఉన్నాయని ఆక్షేపణ తెలిపారు. ''మనం తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి. అవసరమైతే భారత్ విమానాలు కూల్చేయండి'' అని అయూబ్ సూచించారు. షెహబాజ్ షరీప్ మోకరిల్లుతున్నారనీ, మోదీకి గట్టి సమాధానం ఇచ్చి తీరాలని పేర్కొన్నారు.

Pak Earthquake: పా‌క్‌లో భూకంపం.. వారంలో ఇది రెండోసారి


పహల్గాం దాడిలో పాక్ ప్రమేయం ఎంతమాత్రం లేదని ఆయూబ్ బుకాయించారు. ''పహల్గాం మనకు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాడితో పాకిస్థాన్‌కు ఏం సంబంధం? దాడిని మనం ఖండిస్తు్న్నాం. పాకిస్థాన్ ఎన్నడూ అలాంటి చర్యలకు పాల్పడదు'' అని అన్నారు. షెబజాబ్ షరీప్ చేసిన వ్యాఖ్యలను మరోసారి ఖండిస్తూ, పాకిస్థాన్‌ను ప్రేమించే వ్యక్తిగా తానైతే ఎన్నడూ అలాంటి ప్రసంగం చేయనని, మన (పాక్) ప్రమేయం లేనప్పుడు ఇన్వెస్టిగేషన్‌కు మనం ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించారు.


కాగా, ఉగ్రిక్తతల వేళ అందరూ ఐక్యతా పిలుపునివ్వాలని, పారామిలటరీ రోజువారీ కార్యక్రమాలను సస్పెండ్ చేసి జాతికి ఐక్యతా సందేశం ఇవ్వాలని న్యాయ శాఖ మంత్రి అజామ్ నజీర్ తరర్ సూచించారు. యావద్దేశం ఐక్యంగా ఉండటమే తక్షణావసరమని, అందరూ ఒకే మాటపై ఉండి దేశం కోసం నిలబడాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

Pak Missile Test: రెండోసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన పాక్

India Pak War: యుద్ధం వస్తే పారిపోతానన్న పాక్ ఎంపీ

Smallest War: వార్ ఒన్ సైడ్ అంటే ఇదే.. ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధమిదే..

Updated Date - May 05 , 2025 | 09:03 PM