Share News

Bangladesh: ఎన్నికల విఘాతానికే హాదీ హత్య .. యూనస్ సర్కార్‌పై సంచలన ఆరోపణ

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:05 PM

మాజీ ప్రధాని షేక్ హసీనాను గత ఏడాది గద్దె దించడానికి కారణానికి విద్యార్థి ఉద్యమం నుంచి ఏర్పడిన సంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మాంచోకు ప్రతినిధిగా షరీఫ్ ఒస్మాన్ హాదీ ఉన్నారు. డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతనిపై ఢాకాలో కాల్పులు జరిగాయి.

Bangladesh: ఎన్నికల విఘాతానికే హాదీ హత్య .. యూనస్ సర్కార్‌పై సంచలన ఆరోపణ
Omar Hadi

ఢాకా: బంగ్లాదేశ్ విద్యార్థి నేత షరీఫ్ ఒస్మాన్ హాదీ (Sharif Osman Hadi) ఇటీవల ఢాకాలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ కన్నమూయడం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉండటం, ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడం ఎన్నికల వేడిని మరింత పెంచింది. హాదీ హత్యా ఘటనపై ఆయన సోదరుడు షరీప్ ఒమర్ హాదీ బుధవారంనాడు తొలిసారిగా స్పందించారు. బంగ్లా తాత్కాలిక యూనస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకే యూనన్ ప్రభుత్వంలోని ఒక వర్గం తన సోదురిడి హత్యకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహించాల్సింది యూనస్ సర్కారేనని అన్నారు.


మాజీ ప్రధాని షేక్ హసీనాను గత ఏడాది గద్దె దించడానికి కారణానికి విద్యార్థి ఉద్యమం నుంచి ఏర్పడిన సంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మాంచోకు షరీఫ్ ఒస్మాన్ హాదీ ప్రతినిధిగా ఉన్నారు. డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతనిపై ఢాకాలో కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన హాదీని సింగపూర్‌ తరలించగా చికిత్స పొందుతూ డిసెంబర్ 18న కన్నుమూశారు. హాదీ హత్యతో బంగ్లావ్యాప్తంగా అల్లర్లు చెలరాగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వార్తాసంస్థలు, సాంస్కృతిక సంస్థలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి.


మీరూ బంగ్లా వదలి పారిపోవాల్సి వస్తుంది

హాదీ హత్యపై ఢాకాలో బుధవారంనాడు జరిగిన నిరసన ప్రదర్శనలో షరీప్ ఒమర్ మాట్లాడుతూ, యూనస్ ప్రభుత్వమే హాదీని చంపిందని, ఇప్పుడు దీన్ని ఒక అంశంగా మలుచుకుని ఎన్నికల ప్రక్రియను పట్టాలమీద నుంచి తప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల వాతావరణానికి ఎలాంటి విఘాతం కలుగకుండా హాదీ హత్యపై శీఘ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 'ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. హాదీ హత్యకు తగిన న్యాయం జరగకపోతే మీరు కూడా ఒక రోజు బంగ్లాదేశ్ విడిచి పారిపోవాల్సి వస్తుంది' అని యూనస్‌‌ను షరీఫ్ ఒమర్ హెచ్చరించారు. గత ఏడాది పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమం కుదిపేయడంతో ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన విషయం విదితమే.


ఇవి కూడా చదవండి..

దిగొచ్చిన యూనస్ సర్కార్.. దీపూదాస్ హంతకులపై చర్యలకు హామీ

బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల

Updated Date - Dec 24 , 2025 | 12:10 PM