Share News

Bangladesh Violence: ఆగని హింస, బీఎన్‌పీ నేత ఇంటికి నిప్పు.. ఏడేళ్ల కుమార్తె సజీవదహనం

ABN , Publish Date - Dec 21 , 2025 | 07:48 PM

బెలాల్‌తో పాటు ఆయన మరో ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14) తీవ్రంగా గాయపడటంతో ఆ తర్వాత ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని బర్న్ యూనిట్‌కు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.

Bangladesh Violence: ఆగని హింస, బీఎన్‌పీ నేత ఇంటికి నిప్పు.. ఏడేళ్ల కుమార్తె సజీవదహనం
Bangladesh Violence

ఢాకా: భారత్ అంటే విద్వేషం కలిగిన ఇంకిలాబ్ మోంచో విద్యార్థి నేత షరీప్ ఉస్మాన్ హాదీ (Sharif Osman Hadi) మరణాంతరం బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాకాండ తగ్గుముఖం పట్టలేదు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేత బేలాల్ హొస్సేన్ ఇంటికి దుండగులు నిప్పుపెట్టడంతో ఆయన ఏడేళ్ల కుమార్తె మంటల్లో సజీవదహనమైంది. శనివారం తెల్లవారుజాము ఒంటిగంట ప్రాంతంలో దుండగులు బేలాల్ హొస్సేన్ ఇంటికి బయట నుంచి తాళం వేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని, మంటల్లో చిక్కుకున్న ఏడేళ్ల చిన్నారి అయేషా అక్తర్ సజీవ దహనమైందని 'డైలీ స్టార్' పత్రిక వెల్లడించింది.


బెలాల్‌తో పాటు ఆయన మరో ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14) తీవ్రంగా గాయపడటంతో వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని బర్న్ యూనిట్‌కు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. దుండగులు తమ ఇంటి తలుపులకు తాళాలు వేసి పెట్రోల్‌తో తగులబెట్టినట్టు బెలాల్ తల్లి ధ్రువీకరించారు.


రెచ్చగొట్టిన యూనస్

ఒస్మాన్ హాదీ మరణాంతరం ఢాకా సహా పలు ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు 'డైలీ స్టార్', 'ప్రొథోమ్ అలో' పత్రికా కార్యాలయాల వెలుపల తీవ్ర నిరసనలకు దిగారు. హాదీకి అంతిమవీడ్కోలు పలికేందుకు పెద్దఎత్తున జనం ఢాకాకు చేరుకోవడంతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మమహ్మద్ యూనస్ సైతం ఈ అంత్యక్రియలకు హాజరై సంచలన వ్యాఖ్యలు చేసారు. బంగ్లాదేశ్ ఉన్నంత కాలం హాజీ జీవించే ఉంటారని, దేశం మర్చిపోలేని మంత్రానికి హాజీ అందరికీ అందించారని, అది ఎప్పటికీ తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

భారత్ వ్యతిరేకి హాదీ అంత్యక్రియలకు యూనస్.. కీలక వ్యాఖ్యలు..

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పరిమితంగా ట్రంప్ ప్రస్తావన.. విమర్శల వెల్లువ

Updated Date - Dec 21 , 2025 | 07:48 PM