Lord Swaraj Paul Passes Away: ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్ కన్నుమూత
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:15 AM
ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్ లండన్‌లో గురువారం సాయంత్రం మృతి చెందారు..
లండన్, న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్ లండన్‌లో గురువారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. కపారో గ్రూప్ పేరిట యూకేలో పలు పరిశ్రమలు స్థాపించిన ఆయన ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే కన్ను మూశారు. భారత్‌లోని జలంధర్‌లో జన్మించిన ఆయన 1960లో తన కుమార్తె అంబిక క్యాన్సర్ చికిత్స కోసం యూకే చేరుకున్నారు. కాలక్రమంలో యూకే ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యుడయ్యారు. నాలుగేళ్ల వయస్సులోనే తన కుమార్తె అంబిక క్యాన్సర్‌తో మృతి చెందడంతో అంబికాపాల్ ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్‌ని స్థాపించారు. దీని ద్వారా బాలల ఆరోగ్యం, విద్య కోసం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల డాలర్లు దానం చేశారు. 2015లో తన కుమారుడు అంగద్‌పాల్, 2022లో ఆయన భార్య అరుణ మృతి చెందగా వారి జ్ఞాపకార్థం ఇదేవిధంగా పలు దాన కార్యక్రమాలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
For More National News And Telugu News