Share News

Netanyahu Calls UNs Declaration : ఐక్యరాజ్యసమితి ప్రకటనపై నెతన్యాహు తీవ్ర అభ్యంతరం

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:55 PM

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్యసమితి ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, ఇజ్రాయెల్ సైనిక చర్యలు పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని UN నివేదికలు..

Netanyahu Calls UNs Declaration : ఐక్యరాజ్యసమితి ప్రకటనపై నెతన్యాహు తీవ్ర అభ్యంతరం
Netanyahu Calls UNs Declaration

ఇంటర్నెట్ డెస్క్ : ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Israeli Prime Minister Benjamin Netanyahu) ఐక్యరాజ్యసమితి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది పూర్తిగా అబద్ధమని, ఇదొక అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు. గాజా(Gaza)లో కరవు ఉందంటూ యునైటెడ్ నేషన్స్ చేసిన ప్రకటనపై నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gaza-1.jpgగాజా ప్రాంతంలో కరవు (ఫామిన్) ఉందని ఐక్యరాజ్యసమితి (United Nations) చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించిన నెతన్యాహు.. ఈ ప్రకటనను 'ఆధునిక రక్తపాతపు అపవాదుగా (మోడర్న్ బ్లడ్ లైబెల్)గా అభివర్ణించారు. గాజాలో మానవతా సంక్షోభం ఉందని సూచిస్తూ ఐక్యరాజ్యసమితి.. ఇజ్రాయెల్ చర్యలను విమర్శించడంతో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.

United-Nations-Vs-Israel.jpgగాజాలో హమాస్‌(Hamas)తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, ఇజ్రాయెల్ సైనిక చర్యలు పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని UN నివేదికలు పేర్కొన్నాయి. ఈ నివేదికల ప్రకారం, గాజాలో ఆహార కొరత, పోషకాహార లోపం, ప్రాథమిక సౌకర్యాల కొరత కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపాయి. అయితే, నెతన్యాహు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.


Gaza-3.jpgఇజ్రాయెల్ గాజాకు మానవతా సాయం అందిస్తోందని, కానీ హమాస్ ఈ సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని నెతన్యాహు ఆరోపించారు. 'ఇజ్రాయెల్.. పౌరుల భద్రత కోసం పోరాడుతోంది, కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఇజ్రాయెల్‌ను తప్పుబడుతోంది.' అని ఆయన అన్నారు.నెతన్యాహు ఈ ప్రకటనను యూదులపై చారిత్రాత్మకంగా చేసిన 'రక్తపు అపవాదు'తో పోల్చారు.

Gaza.jpgఇది యూదులకు వ్యతిరేకంగా చేసిన అసత్య ఆరోపణలను సూచిస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్.. గాజాలో చేస్తున్న సైనిక చర్యలను సమర్థిస్తూ, హమాస్‌ను నిర్మూలించడమే తమ లక్ష్యమని నెతన్యాహు స్పష్టం చేశారు. అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి ప్రకటన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రాజకీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంగా ఆయన దుయ్యబట్టారు.

Gaza-4.jpgఈ వివాదం ఇజ్రాయెల్, అంతర్జాతీయ సమాజం మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. గాజాలో మానవతా సంక్షోభం, ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అంతర్జాతీయ వేదికలలో చర్చలు కొనసాగుతున్నాయి.

Gaza-2.jpg


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 09:13 PM