Share News

India Vs Pakistan: భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:57 PM

భారత్‌ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ దాడులు చేసే అవకాశం ఉందని నేపాల్ హెచ్చరించింది. ఆ క్రమంలో ఆ యా ఉగ్రవాద సంస్థలు నేపాల్ మార్గాన్ని ఉపయోగించుకునే అవకాశాలున్నాయని సందేహం వ్యక్తం చేసింది.

India Vs Pakistan: భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
Pakistan terror groups

ఖాట్మాండ్, జులై 11: భారత్‌ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ దాడులు చేసే అవకాశం ఉందని నేపాల్ హెచ్చరించింది. ఆ క్రమంలో ఆ యా ఉగ్రవాద సంస్థలు నేపాల్ మార్గాన్ని ఉపయోగించుకునే అవకాశాలున్నాయని సందేహం వ్యక్తం చేసింది. నేపాల్‌ రాజధాని ఖాట్మాండ్‌లో ఇటీవల నేపాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎంగేజ్‌మెంట్ పేరిట సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు వేదికగా దక్షిణాసియాలో ఉగ్రవాద సమస్యపై చర్చించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఉగ్రవాదానికి పాక్ ఊతం..

ఈ సదస్సులో నేపాల్‌ దేశాధ్యక్షుడి సలహాదారు సునీల్ బహదూర్ థాపా మాట్లాడుతూ.. భారతదేశంలోని ఉగ్రవాద సంఘటనలు.. తరచూ నేపాల్‌లో సైతం ప్రతిధ్వనిస్తాయన్నారు. ఇది ప్రాంతీయ శాంతి, సుస్థిరకు ముప్పు కలిగిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ నిరంతరాయంగా మద్దతు ఇస్తుందని విమర్శించారు. ఇది సార్క్‌పై ప్రభావం చూపడంతో పాటు ప్రాంతీయ సమైక్యతకు పెద్ద అవరోధంగా మారుతుందని తెలిపారు.


దృఢమైన ప్రాంతీయ సహకారం ఉండాలి..

దక్షిణాసియాలో ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని పెంపొందించాల్సిన అవశ్యకతను ఈ వేదికగా పలు దేశాల ప్రతినిధులు నొక్కి చెప్పారు. మనీలాండరింగ్‌‌ను ఎదుర్కొవడానికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు దేశాల మధ్య మెరుగైన నిఘా భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. సరిహద్దు నిఘాలో దేశాల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో దక్షిణాసియాలోని కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని మండిపడ్డారు. వీటిని విడనాలని ఆ యా దేశాలకు వారు సూచించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌తోపాటు ఐసీ 814 విమానం హైజాకింగ్ తదితర అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.


నేపాల్‌ ప్రస్తుతం భద్రత పరంగా బలహీనంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్, భారత్‌ల మధ్య 1,751 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉందని వివరించారు. ఆ సరిహద్దులో పలు ప్రాంతంలోని చోరబాట్లకు ఆస్కారం విస్తృతంగా ఉందన్నారు. భారత్‌లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు.. వీటిని వినియోగించుకున్న అవకాశాలున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేపాల్‌కు చెందిన నకిలీ కీలక పత్రాల ద్వారా పలువురు ఉగ్రవాదులు గతంలో భారత్‌లో ప్రవేశించిన ఉదంతాలు ఉన్నాయని వారు స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

For More International News And Telugu News

Updated Date - Jul 11 , 2025 | 09:14 PM