G7 Summit 2025: సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా జార్జియా మెలోని .. ప్రెంచ్ అధ్యక్షుడితో రహస్యంగా మాట్లాడుతూ..
ABN , Publish Date - Jun 17 , 2025 | 08:38 PM
కెనడాలో జీ7 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రధానులు హాజరవుతున్నారు. ఇదిలావుండగా.. ఈ సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కెనడాలో జీ7 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రధానులు హాజరవుతున్నారు. ఇదిలావుండగా.. ఈ సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలోఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కెనెడాలోని (Canada) ఆల్బెర్టా ప్రాంతంలో 51వ G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వివిధ దేశాల ప్రధాన మంత్రులు హాజరయ్యారు. అయితే ఈ సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Italian Prime Minister Giorgia Meloni) ప్రవర్తించిన తీరు ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. సభలో వివిధ అంశాలపై డొనాల్డ్ ట్రంప్ తదితరులు చర్చిస్తున్న సమయంలో జార్జియా మెలోనీ విచిత్రంగా ప్రవర్తించింది.
పక్కనే కూర్చున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (French President Emmanuel Macron) .. జార్జియా మెలోని చెవిలో ఏదో చెప్పసాగాడు. దీంతో ఆమె తల దగ్గరగా పెట్టి మరీ ఆసక్తిగా మొత్తం విన్నది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇదంతా జరిగింది. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాటలను శ్రద్ధగా విన్న జార్జియా మెలోనీ.. చివరగా బొటన వేలు పైకి చూపడంతో పాటూ కళ్లను ఆర్పుతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో అంతా వీరి సంభాషణపై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. నెటిజన్లు వారి సంభాషణపై తమకు తోచిన విధంగా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
గతంలో అల్బేనియా రాజధాని టిరానాలో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమ్మిట్‌కు మెలోనీ హాజరైన సందర్భంలో అల్బేనియన్ ప్రధాన మంత్రి ఎడి రామా మోకాళ్లపై నిలబడి మెలోనీకి స్వాగతం పలికిన వీడియో తెగ వైరల్ అయింది. అలాగే అమెరికా టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో.. జార్జియా మెలోని దిగిన ఫొటోలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. న్యూయార్క్‌లో జరిగిన బ్లాక్-టై ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా ఎలాన్ మస్క్, జార్జియా మెలోని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ తమ ఇద్దరి మధ్య స్నేహం ఉందని కూడా చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా అల్బెర్టాలో సోమవారం రాత్రి జరిగిన 51వ G7 సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ సదస్సు నుంచి అకస్మాత్తుగా నిష్ర్కమించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగానే ఇలా త్వరగా వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పదేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కెనడాలో అడుగుపెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే ప్రధాని మోదీ కెనడాలో అడుగుపెట్టడానికి ముందే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సదస్సు నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి..
కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ..ట్రంప్ నేతన్యాహూ మధ్య వీటో వివాదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి