Share News

Russian oil: రష్యా నుంచి చమురు దిగుమతుల నిలిపివేత.. ప్రత్యామ్నాయాలపై దృష్టి..

ABN , Publish Date - Oct 28 , 2025 | 07:20 PM

అమెరికా ఎంత ఒత్తిడి ఎదురైనప్పటికీ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోని భారతీయ సంస్థలు ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. రష్యా చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Russian oil: రష్యా నుంచి చమురు దిగుమతుల నిలిపివేత.. ప్రత్యామ్నాయాలపై దృష్టి..
Indian refiners Russian oil

ఢిల్లీ: అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనప్పటికీ రష్యా చమురు దిగుమతులను తగ్గించుకోని భారతీయ సంస్థలు ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. రష్యా చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి భారతీయ సంస్థలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం మానేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి (Indian refiners Russian oil).


ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత ముడి చమురు దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే జరిగాయి. ఈ ఏడాదిలో రోజుకు సగటున 1.7 మిలియన్ బారెళ్ల (ఎంపీడీ) చొప్పున రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి జరిగింది. అందులో 1.2 ఎంపీడీ ముడి చమురును రష్యా సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకాయిల్ సంస్థలే సరఫరా చేశాయి. అయితే తాజాగా ఆ రెండు సంస్థల నుంచి అమెరికా సంస్థలు, వ్యక్తులు ముడి చమురును కొనుగోలు చేయకూడదని అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాయేతర సంస్థలు కొనుగోలు చేసినా పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది (crude oil trade).


ఆ రెండు సంస్థల నుంచి ముడి చమురును మన దేశానికి చెందిన రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలే ఎక్కువగా కొనుగోలు చేశాయి (Indian oil imports). అయితే తాజాగా ఆ రష్యా సంస్థలపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో మన దేశ కంపెనీలు కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం మానేసినట్టు సమాచారం. ముడి చమురు ఉత్పత్తులపై ఈయూ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఇప్పటికే రిలయన్స్ ప్రకటించింది. రష్యా కంపెనీలపై అమెరికా, ఈయూ, బ్రిటన్ విధించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని, నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. పశ్చిమాసియా దేశాలతోపాటు అమెరికా కంపెనీల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవాలని భారత రిఫైనరీలు భావిస్తున్నాయట.


ఇవి కూడా చదవండి:

పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు

పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 28 , 2025 | 08:25 PM