Share News

Indians in Russian army: రష్యా ఆర్మీలో చేరొద్దు.. ఆ ఆఫర్లు ప్రమాదకరం: కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:00 PM

కొందరు భారతీయులు రష్యా ఆర్మీలో చేరి ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రష్యా ఆఫర్లు అందుకుని, ఆ దేశ సైన్యంలో చేరడం ప్రమాదకరమని హెచ్చరించింది.

Indians in Russian army: రష్యా ఆర్మీలో చేరొద్దు.. ఆ ఆఫర్లు ప్రమాదకరం: కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..
India MEA warning

కొందరు భారతీయులు రష్యా ఆర్మీలో చేరి ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది (Indians in Russian army). రష్యా ఆఫర్లు అందుకుని, ఆ దేశ సైన్యంలో చేరడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. రష్యా సైన్యంలో చేరి కష్టాలు కొని తెచ్చుకోవద్దని సూచించింది (India MEA warning).


'రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నట్టు కొన్ని నివేదికలు మా దృష్టికి వచ్చాయి. రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండండి. అది చాలా ప్రమాదకరం. రష్యా సైన్యంతో కలిసి పని చేయడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. ఎవరూ రష్యా సైన్యంలో చేరకండి. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని వెనక్కి పంపించాల్సిందిగా రష్యా అధికారులను కోరుతున్నాం. వారి కుటుంబాలను కూడా సంప్రదిస్తున్నాం' అని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది (Job scam Russia).


రకరకాల ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో పనుల పేరుతో చాలా మంది భారతీయులను రష్యాకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారిని బలవంతంగా యుద్ధరంగంలోకి దింపుతున్నారు (Human trafficking India). ఈ మేరకు ఇద్దరు భారతీయ పౌరులు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వారిని విజిటర్స్ వీసాల మీద రష్యా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వీరి వ్యవహారంపై కేంద్రం స్పందించింది. వెంటనే రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. రష్యా ఆర్మీలో ఉన్న వారిని వెంటనే స్వదేశానికి పంపించాలని ఒత్తిడి తీసుకొస్తోంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 11 , 2025 | 12:26 PM